NTV Telugu Site icon

Millionaire migrations: ఇండియాను వదులుతున్న మిలియనీర్లు.. ఏ దేశాలకు వెళ్తున్నారంటే..?

Uae

Uae

Millionaire migrations: మిలియనీర్లు భారత్ నుంచి వలస బాట పడుతున్నారు. ఈ ఏడాది దాదాపుగా 4300 మంది మిలియనీర్లు భారత దేశాన్ని విడిచిపెడతారని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడి వలసల సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ఇటీవల విడుదల చేసిన నివేదికల ఈ విషయాలను పేర్కొంది. గతేడాది ఇదే నివేదిక 5100 మంది భారత మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చినట్లు చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. చైనా, యూకే తర్వాత మిలియనీర్ల వలసల్లో మూడో స్థానంలో ఉంది.

భారత్ నుంచి ఇలా వలసవెళ్లే వారు తమ గమ్యస్థానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ని ఎంచుకుుంటున్నారు. భారత్ వేలాది మిలియనీర్లను కోల్పోతుండగా, అనేక మంది యూఏఈకి వెళ్తున్నారు. అయితే, భారత్ మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ 85 శాతం వృద్ధితో దేశంలో కొత్త మిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. దీంతో వలసలపై ఆందోళన తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇలా వెళ్తున్న ధనవంతులు భారత్‌ని తమ రెండో ఇళ్లుగా భావిస్తూనే, భారతదేశంలో వ్యాపార ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు, ఇది కొనసాగుతున్న ఆర్థిక సంబంధాన్ని సూచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

Read Also: Jammu Kashmir: బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

భారత ప్రైవేట్ బ్యాంకులు, సంపద నిర్వహణ ప్లాట్‌ఫారమ్స్ తమ క్లయింట్స్‌కి పెట్టుబడి సలహా సేవల్ని అందించేందుకు యూఏఈకి విస్తరిస్తున్నాయి. ఇదే విధంగా ఇతర బ్యాంకులు కూడా యూఏఈలో తమ ఉనికిని బలపరుస్తున్నాయి. భారతీయ కుటుంబాలకు కాంపిటేటివ్ వెల్త్ మేనేజ్‌మెంట్ సేవల్ని అందిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 1,28,000 మంది మిలియనీర్లు 2024లో ఇలా వలస వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. యూఏఈతో పాటు అమెరికా వీరి ప్రాధాన్య గమ్యస్థానాలుగా అగ్రస్థానంలో ఉన్నాయి. వలస వచ్చిన మిలియనీర్లు వారితో పాటు గణనీయమైన ఆస్తులను తరలించడం ద్వారా విదేశీ మారక నిల్వలకు దోహదం చేస్తారు. వారి పెట్టుబడుల ద్వారా ఈక్విటీ ప్లేస్‌మెంట్ల ద్వారా స్థానిక స్టాక్ మార్కెట్లను కూడా ఉత్తేజపరుస్తాయి. ఇదే కాకుండా మిలియనీర్లచే స్థాపించబడే కంపెనీలు, సంస్థలు అధిక చెల్లింపు ఉద్యోగాలను సృష్టిస్తాయి. మధ్య తరగతికి ప్రయోజనం చేకూరుస్తాయి.

ఒక మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ లిక్విడ్ ఇన్వెస్ట్ చేయదగిన ఆస్తులను కలిగిన వ్యక్తిని మిలియనీర్‌గా అభివర్ణిస్తారు. భద్రత, ఆర్థిక పరిగణనలు, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు మరియు మొత్తం జీవన ప్రమాణాలతో సహా వివిధ కారణాల వల్ల ధనవంతులు ఇలా వలస వెళ్తున్నారు.