NTV Telugu Site icon

PM Modi: రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ విదేశీ టూర్‌లకు టికెట్లు బుక్ చేసుకున్నారు..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత నేతల ఫారిన్ టూర్ల టికెట్లు బుక్ అయ్యాయని తనకు ఎవరో సమాచారం అందించాలని అన్నారు. ఇద్దరి పేర్లను నేరుగా తీసుకోకుండా.. ‘‘ కాంగ్రెస్, ఎస్పీ పార్టీల కలలు చెదిరిపోయాయి. జూన్ 4 తర్వాత ఓటమికి ఎవరిని నిందించాలనే ప్లాన్ వేస్తున్నారు. వారి విదేశీ పర్యటన టిక్కెట్లు కూడా బుక్ అయ్యాయని ఎవరో నాకు సమాచారం ఇచ్చారు’’ అని ప్రధాని అన్నారు.

Read Also: Swati Maliwal Assault: స్వాతి మలివాల్ దాడి కేసులో వైరల్ అవుతున్న వీడియో..భద్రతా సిబ్బందితో తీవ్ర వాగ్వాదం..

ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఉనికి లేదు, కాంగ్రెస్ మొత్తం కుటుంబ గౌరవాన్ని కాపాడటంలో నిమగ్నమైందని ఆయన ఆరోపించారు. ప్రతీ ఎన్నికల్లో భావసారూప్యత ఉన్న కాంగ్రెస్, ఎస్పీలు భాగస్వామ్యంలో పోటీ చేయతాయని, ఈ రెండు కూడా కుటుంబం, అవినీతి కోసం రాజకీయాల్లో ఉన్నాయని, రెండు పార్టీలు ఓటు బ్యాంకును సంతోషపెట్టడానిక ఏదైనా చేయగలరని, ఇరు పార్టీలు నేరస్తులు, మాఫియాను ప్రోత్సహిస్తాయని, కాంగ్రెస్-ఎస్పీలు రెండూ కూడా ఉగ్రవాదుల పట్ట సానుభూతితో ఉంటాయని ఆయన అన్నారు.

గ్యాంగ్‌స్టర్, ఇటీవల మరణించిన ముఖ్తార్ అన్సారీ ఇంటికి వెళ్లి అఖిలేష్ యాదవ్ వారి కుటుంబాన్ని పరామర్శించడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాఫియాపై సమాజ్‌వాదీ పార్టీ ప్రేమ ముగియలేదు, వారి పార్టీ అధినేత మాఫియా సమాధిపై ‘ఫాతియా’ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పాకిస్తాన్ భారత్‌పై దాడి చేసేదని, కాంగ్రెస్ వారికి క్లీన్‌చిట్ ఇచ్చయేది, వారు ‘కాషాయ ఉగ్రవాదం’ అంటూ తప్పుడు కథనాలు అల్లేవారని ఆరోపించారు. యూపీలో గతంలో ఎస్పీ సర్కార్ అల్లర్లకు ఆతిథ్యం ఇస్తుంటే, గ్యాంగ్‌స్టర్ సీఎంని కలిసేందుకు హెలికాప్టర్లతో పర్యటించేవారని ప్రధాని అన్నారు.