NTV Telugu Site icon

Asadudiin Owaisi: ప్రధానికి ఆ ధైర్యం ఉందా..? యూసీసీపై ప్రధాని వ్యాఖ్యలకు ఓవైసీ కౌంటర్..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asadudiin Owaisi: భారతదేశంలో వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఓ సమస్యగా భావిస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. భోపాల్ లో ఓ సభలో ప్రధాని నరేంద్రమోడీ యూనిఫా సివిల్ కోడ్ (యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాల మాదిరిగా కాకుండా ఇస్లాంలో వివాహం ఓ ఒప్పందం అని ఆయన పేర్కొన్నారు. సంస్కృతి హక్కు ప్రాథమిక హక్కు అని అన్నారు. ప్రధాని హిందూ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతున్నారని.. హిందూ అవిభాజ్య కుటుంబాన్ని రద్దు చేసే ధైర్యం ప్రధానికి ఉందా..? అని ప్రశ్నించారు. పంజాబ్ వెళ్లి సిక్కులకు యూసీసీ గురించి చెప్పంది, అక్కడ స్పందన ఎలా ఉంటుందో చూడండి అంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Hair Fall: వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

ఇస్లాంలో వివాహం అనేది ఒక ఒప్పందం. ఇది ఇతర మతాలకు భిన్నంగా ఉంటుంది. వీటన్నింటిని కలిపేస్తారా..? అని ప్రశ్నించారు. మీకు 300 కన్నా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, హిందూ అవిభక్త కుటుంబాన్ని రద్దు చేయడం అని సవాల్ విసిరారు. బీజేపీ బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలను అనుసరిస్తుందని ఓవైసీ ఆరోపించారు.

అంతకముందు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ మంగళవారం మాట్లాడారు. దేశం రెండు చట్టాలపై నడవదని అన్నారు. యూసీసీ గురించి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసమే ముస్లింలను రెచ్చగొడుతున్నాయని అన్నారు. రాజ్యాంగం అందరికి సమాన హక్కుల గురించి మాట్లాడుతుందని.. యూసీసీ అమలు చేయాలని సుప్రీంకోర్టు కోరిందని ఆయన గుర్తు చేశారు. యూసీసీ మాత్రమే కాదని.. ట్రిపుల్ తలాక్ ముప్పు ముస్లిం మహిళలకే కాదని.. కుటుంబాలను కూడా నాశనం చేస్తుందని ప్రధాని అన్నారు.