Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- ఇజ్రాయిల్ హీరోగా నిలిచిన భారత పైలట్ స్మిత్ మచ్చర్..
- ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కీలక పాత్ర..
- సకాలంలో కాక్‌పిట్ తెరవడంతో తప్పిన ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో ప్రయాణికుల్ని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కో-పైలట్ దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నిం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పైలట్ కత్తి గాయాలకు గురైనప్పటికీ, వెంటనే కాక్‌పిట్ తలుపులు తెరవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్ స్మిత్ సరైన సమయంలో కాక్‌పిట్ తెరవడంతో ప్రయాణికులు నిందితుడైన కో పైలట్‌ను అదుపులోకి తీసుకుని, విమానం కుప్పకూలకుండా అడ్డుకున్నారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఇదిలా ఉంటే, మెజారిటీ ఇజ్రాయిల్ జాతీయులే ఉన్న ఈ విమానాన్ని రక్షించిన స్మిత్ మచ్చర్‌పై ఇజ్రాయిల్ దేశం మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. ఆ దేశంలోనే ప్రతీ ఇంటిలో ఇప్పుడు భారత పైలట్ పేరే మారుమోగుతోంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా ఆయన సాహసాన్ని కీర్తించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా స్మిత్ ధైర్యాన్ని కొనియాడారు. ఇజ్రాయిల్‌లోని ప్రతీ ఇన్ఫ్లూయెన్సర్, ప్రతీ మీడియా ఇప్పుడు స్మిత్ జపమే చేస్తోంది.
Also Read
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ.. కెప్టెన్ స్మిత్ ధైర్యాన్ని ఇజ్రాయిల్ ఎప్పటికీ మరిచిపోదని అన్నారు. ప్రెసిడెంట్, ప్రధాని నుంచి సామాన్య ప్రజలు వరకు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. సంక్షోభ సమయంలో తమకు అండగా నిలిచిన మిత్రులను ఇజ్రాయిల్ మరిచిపోదని, స్మిత్‌ను గౌరవిస్తామని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనలో స్మిత్‌కు అండగా నిలిచిన ఇజ్రాయిల్ ప్రయాణికుల్ని ఆ దేశం సత్కరించింది. అధ్యక్షుడు ఐజాక్ హోర్జోగ్ ప్రయాణికులు యానివ్ హయూన్, జ్వికా మానెస్, అసఫ్ రజువాన్, డాక్టర్ షోటా ముసాయేవ్లను ‘‘ప్రెసిడెంట్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’’ కోసం సిఫారసు చేశారు.
తాజావార్తలు
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?