Smallest City: భారతదేశంలో ఎన్నో మహానగరాలున్నాయి.. వాటితోపాటు పట్టణాలు.. నగరాలు కూడా ఉన్నాయి. దేశంలో ఉన్న మహానగరాలతో పాటు పురాతన కట్టడాలను సందర్శించడానికి విదేశీ పర్యాటకులు వస్తుంటారు. అయితే దేశంలో అతిపెద్ద నగరాలు.. చిన్న నగరాలు కూడా ఉన్నాయి. వాటిలో అత్యంత చిన్న నగరం ఏదో తెలుసా.. గతంలో దానిని ఇండియా ప్యారిస్ అని కూడా పిలిచే వారు.. అదే పంజాబ్‌లోని కపూర్థలా నగరం. నగరం చిన్నదైన అందమైన చారిత్రక కట్టడాలకు, విశాలమైన రహదారులతో నగరం విలసిల్లుతోంది.
Read also: WTC Table 2023-25: విండీస్‌తో టెస్టు సిరీస్ గెలిచినా ప్రయోజనం లేదు.. రెండో స్థానంలో భారత్!
భారతదేశం పలు విభిన్నతలు, ప్రత్యేకతలు కలిగిన దేశం. దేశంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇవి మనదేశ ఘనతను చాటుతున్నాయి. వాటికి ఆకర్షితులైన విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. మనదేశంలో మ్తొతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పలు నగరాలు ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత చిన్న నగరం కూడా ఉంది. 2011 ప్రకారం ఆ నగరంలో జనసంఖ్య 98,916 మాత్రమే. కోవిడ్ కారణంగా జనాభా గణన ఇటీవలి కాలంలో జరగలేదు. పంజాబ్‌లోని కపూర్థలా అందమైన చారిత్రక కట్టడాలకు, విశాలమైన రహదారులకు పేరొందింది. ఒకానొక సమయంలో దీనిని పంజాబ్ పారిస్ అని పిలిచేవారు. ఇక నగరాన్ని స్థాపించిన నవాబ్ కపూర్ పేరిట ఈ ప్రాంతానికి కపూర్థలా అనే పేరు వచ్చింది. భారతీయ రైల్వోలతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది. రైల్వే బోగీలు ఇక్కడే తుదిమెరుగులు దిద్దుకుంటాయి. ఇక్కడి జగత్‌జీత్ ప్యాలెస్ ఒకప్పుడు కపూర్థలా రాజ్యానికి రాజైన మహారాజా జగత్‌జీత్ సింగ్‌కు నివాసంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్యాలెస్‌లో సైనిక స్కూల్ నడుస్తోంది. ఈ మహల్‌ను1908లో నిర్మించారు. ఇక్కడి వాస్తుకళ ఈ నాటికీ అందరినీ అలరిస్తుంటుంది. కపూర్థలా నగరానికి పంజాబ్‌లోని అన్ని పట్టణాల నుంచి రవాణా సదుపాయం ఉంది. అలాగే అమృత్‌సర్‌లోని విమానాశ్రయం నుంచి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. జలంధర్ రైల్వే స్టేషన్ నుంచి కపూర్థలాకు చేరుకోవడానికి రవాణా సౌకర్యం కలదు.
