Ketan Agarwal Murder Case: పెళ్లే జరగదు.. అయినా టికెట్లు బుక్ చేయాలి: సియా స్నాప్‌చాట్ వైరల్

  • కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు..
  • వెలుగులోకి వచ్చిన సియా స్నాప్ చాట్ మెసేజ్‌లు..
  • పెళ్లే జరగదు అంటూ స్నేహితురాలితో చాట్..
Siya Goel

Siya Goel

Ketan Agarwal Murder Case: కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా, సియా గోయల్ తన పెళ్లికి ముందు స్నేహితురాలితో చేసిన స్నాప్ ‌చాట్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఈ కేసును కొత్త మలుపు తిప్పేదిగా ఈ చాట్‌ను భావిస్తున్నారు. పూణేలోని లోహగడ్ కోట నుండి 26 ఏళ్ల కేతన్‌ను సియా (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) లోయలోకి తోసేశారని ఆరోపణలు రావడానికి సుమారు మూడు వారాల ముందు, మే 25న ఈ సంభాషణ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ చాట్‌లో, పెళ్లికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ సియా తన స్నేహితురాలి ఆధార్ కార్డ్ ముందు, వెనక పంపించాలని కోరుతుంది. ఇలా చెబుతూనే.. ‘‘జరగని పెళ్లి కోసం టికెట్లు బుక్ చేయాలి.. అయినా పంపు’’ అని అర్థం వచ్చేలా స్నేహితురాలితో చాట్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రతిగా ఇప్పటికే వాట్సాప్‌లో పంపించినట్లు స్నేహితురాలు సమాధానం ఇస్తుంది. ఇప్పుడు ఈ చాట్ వైరల్‌గా మారింది. ముందుగానే పెళ్లిని ఆపేందుకు సియా పక్కా ప్లాన్‌లో ఉందనే అనుమానాలను మరింత బలపరిచాయి. అయితే, ఈ చాట్ ప్రామాణికతను పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.

హత్య అనంతరం అనుమానాలు మళ్లించడానికి లేదా తప్పుడు కథనాలను సృష్టించడానికి ఒక పెద్ద ప్లాన్‌లో భాగంగా ఈ ఫ్లైట్ బుకింగ్స్ జరిగాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సియా ఫ్రెండ్‌కు ఆమె కుట్ర గురించి తెలుసో లేదో అనేది ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే కేతన్ హత్య గురించి తెలిసిన మూడో వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను చేతన్ క్లాస్‌మేట్ అని భావిస్తున్నారు.

కేతన్, సియాల ఎంగేజ్మెంట్ ఈ ఏడాది ఆరంభంలో జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నవంబర్లో వీరిద్దరి వివాహం కావాల్సి ఉంది. ఈ పెళ్లికి హాజరయ్యే అతిథుల కోసం రెండు ప్రత్యేక విమానాలు కూడా బుక్ చేశారు. మరోవైపు సియా ఆమె లవర్ చేతన్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల్లో కోడ్ వర్డ్స్ ఉపయోగించినట్లు, వారి ఫోన్లు పరిశీలించిన తర్వాత పోలీసులు గుర్తించారు.