Site icon NTV Telugu

Rajasthan Accident: ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిన ట్రక్కు.. 6గురు దుర్మరణం

Rajasthan Accident

Rajasthan Accident

Rajasthan Accident: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పాలి జిల్లాలోని సుమేర్‌పూర్ ప్రాంతంలో యాత్రికులను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితులు ట్రాక్టర్ ట్రాలీలో జైసల్మేర్ జిల్లాలోని రామ్‌దేవ్రా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా, వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది.

మరోవైపు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. “రాజస్థాన్‌లోని పాలిలో జరిగిన ప్రమాదం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలను తలచుకుంటే బాధగా ఉంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.

lightning Strikes: ఒడిశాలో స్కూల్ భవనంపై పిడుగుపాటు.. విద్యార్థులకు తీవ్రగాయాలు

ప్రమాదంలో మృతి చెందిన వారికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సంతాపం తెలిపారు.”రాజస్థాన్‌లోని పాలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.

Exit mobile version