Site icon NTV Telugu

Sini Shetty: మిస్ వరల్డ్ 2023లో భారత తరుపున “సినీ శెట్టి” ప్రాతినిధ్యం.. అసలెవరీ సినీ షెట్టి..

Sini Shetty

Sini Shetty

Sini Shetty: 2023లో మిస్ వరల్డ్ పోటీలకు ఇండియాకు ప్రాతినిధ్యం ఇవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీ 27 ఏళ్ల తరువాత భారత్ లో మళ్లీ నిర్వహించబోతోంది. ఇప్పటి వరకు తేదీలు ఖరారు కాకున్నా కూడా.. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ నవంబర్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేతగా నిలిచిన ‘‘సినీ షెట్టి’’ ఈ సారి భారత్ లో నిర్వహించబోతున్న మిస్ వరల్డ్ పోటీలో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా తన తోటి సోదరీమణులను భారత్ కు ఆహ్వనిస్తున్నానని, భారత అంటే ఏమిటో, భారత్ లో వైవిధ్యాన్ని చూపించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని సినీ షెట్టి వ్యాఖ్యానించింది. ఇండియాలో మీరు గడిపే సమయం బాగుంటుందని సినీ షెట్టి అన్నారు.

Read Also: Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో 1033 జాబ్స్‌..పూర్తి వివరాలు..

అసలెవరీ సినీ షెట్టి:

కర్ణాటక మూలాలు ఉన్న సినీ షెట్టి ముంబైలో పుట్టింది. అందుకే మిస్ ఇండియా 2022 పోటీలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు. సినీ శెట్టి అకౌంటింగ్ మరియు ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివారు. మిస్ ఇండియా 2022 విజేత CFA (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) అభ్యసిస్తున్నట్లు సమాచారం. మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. సినీ షెట్టికి తన 14 ఏటనే భరతనాట్యం ఆరంగ్రేటం చేసింది. ప్రియాంకా చోప్రా తనను రోల్ మోడల్ అని చెప్పింది.

Exit mobile version