Site icon NTV Telugu

Neha Singh Rathore: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై కేసు..

Neha Singh Rathore

Neha Singh Rathore

Neha Singh Rathore: వివాదాస్పద ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మరోసారి వివాదంలో నిలిచారు. ముఖ్యంగా, ఈమె బీజేపీ వ్యతిరేకతకు మారుపేరుగా ఉన్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ గురించి తన వీడియోలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నేహాసింగ్‌పై మళ్లీ కేసు నమోదైంది. సామాజిక సంస్థ సాధన ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సౌరభ్ మౌర్య దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా వారణాసిలోని సిగ్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.

Read Also: Trump Tariffs: ఆపిల్‌కి మాత్రమే కాదు, శామ్‌సంగ్‌కి కూడా ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులు..

నేహా సింగ్ తన వీడియోలో ‘‘పిరికి వాడు, జనరల్ డయ్యర్’’ వంటి పదాలను ఉపయోగించి ప్రధాని మోడీని ప్రస్తావించారు. ఆమె వీడియో పాకిస్తాన్ మీడియా ఛానెల్‌లో కూడా ప్రసారం చేయబడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానిని అవమానించడమే కాకుండా, దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని డాక్టర్ మౌర్య పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జాతీయ సమైక్యతను హాని కలిగించడంతో పాటు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందనే సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.

Exit mobile version