గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో కీలక రిపోర్టు బయటకు వచ్చింది. జుబీన్ గార్గ్ హత్యకు గురి కాలేదని సింగపూర్ పోలీసులు తేల్చారు. ఈ మేరకు కీలక నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. ఆయన్ను నీటిలో తోసేసినట్లుగానీ.. ఆత్మహత్య చేసుకున్నట్లుగానీ ఎక్కడా ఆధారాలు కనిపించలేదని తేల్చింది. జుబీన్ గార్గ్ మద్యం మత్తులో ఉన్నారని.. లైఫ్ జాకెట్ ధరించేందుకు నిరాకరించినట్లు నివేదికలో పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి అందజేసినట్లు సింగపూర్ మీడియా వెల్లడించింది.
‘‘నీటిలో ఈత కొట్టిన తర్వాత నౌకలోకి వచ్చేందుకు ప్రయత్నించడాన్ని సాక్షులు చూశారు. అస్వస్థతకు గురైనట్లు గుర్తించి వెంటనే నౌకలోకి తీసుకువచ్చినప్పటికీ కొన్ని గంటల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు అధిక రక్తపోటు, మూర్ఛ వ్యాధి ఉందని తేలింది’’ అని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులు, బోట్ కెప్టెన్, వైద్య సిబ్బంది సహా మొత్తం 35 మందిని విచారించామని, జుబీన్ గార్గ్ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని గుర్తించామని సింగపూర్ పోలీసులు కోర్టుకు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Aishwarya Rai : ఆరాధ్యకు ఫోన్ లేదు.. ఐశ్వర్య రాయ్ కఠిన నిబంధనలు! అభిషేక్ బచ్చన్ షాకింగ్ రివీల్.
గతేడాది జుబీన్ గార్గ్ సింగపూర్‌లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు వెళ్లారు. సెప్టెంబర్ 19, 2025న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు. జుబీన్ గార్గ్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. కేసును సిట్ దర్యాప్తు చేసింది. ఈ కేసులో మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఈవెంట్ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్‌ప్రవ మహంతను అరెస్ట్ చేశారు. వీరిపై హత్య అభియోగాలు నమోదు చేశారు. ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి హిమంత శర్మ మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్ హత్యకు గురయ్యారని ప్రకటించారు.
తాజాగా సింగపూర్ పోలీసులు జుబీన్ గార్గ్ హత్యకు గురి కాలేదని తేల్చారు. ఈ రిపోర్ట్‌పై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. జుబీన్ గార్గ్ మరణవార్త అస్సామీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. లక్షలాది మంది జుబీన్ గార్గ్‌ను చూసేందుకు వచ్చారు.
ఇది కూడా చదవండి: Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన శర్వానంద్!
