NTV Telugu Site icon

India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాదం కోసం పంజాబ్ యువతకు వల..

Canada

Canada

India-Canada: ఇండియా-కెనడాల మధ్య దౌత్యవివాదం తీవ్రస్థాయికి చేరింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇదే దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఇదిలా ఉంటే కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు పంజాబ్ నుంచి ఉపాధి కోసం కెనడా వెళ్లే యువతను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హర్దీప్ సింగ్ నిజ్జర్, మొనీందర్ సింగ్ బుల్, భగత్ సింగ్ బ్రార్ వంటి ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్ నుంచి వచ్చే వారిని ఇండియా వ్యతిరేకతకు పావులుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఖలిస్తానీ ఎలిమెంట్స్ తమ నియంత్రణలో ఉన్న గురుద్వారాల్లో ప్లంబర్లు, ట్రక్ డ్రైవర్లు, రిలిజియస్ వర్కర్లుగా పనిచేసేందుకు తక్కువ నైపుణ్యం ఉన్న పంజాబ్ కు చెందిన సిక్కు యువతకు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ యువత భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాడికల్ మత సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. విద్య కోసం కెనడాకు వచ్చి విద్యాభ్యాసం పూర్తైన తర్వాత ఉద్యోగాలు రాని భారత విద్యార్థులు కూడా ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేత రిక్రూట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Telangana Group1 Exam: తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షపై ఈ రోజే విచారణ.. అభ్యర్థుల్లో ఆందోళన

కెనడాలోని సర్రే, బ్రాంప్టన్, ఎడ్మంటన్ లోని 30 గురుద్వారాలను ఖలిస్తానీ ఉగ్రవాదులు నియంత్రిస్తున్నట్లు సమాచారం. పంజాబ్ లోని ఖలిస్తాన్ అనుకూల పార్టీలు పంజాబ్ కు చెందిన కొందరు యవత కెనడాలో ఆశ్రయం పొందేందుకు భారతదేశంలో రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నట్లు లెటర్లు ఇచ్చేందుకు రూ. 1-2 లక్షలు వసూలు చేస్తుందని వారు తెలిపారు. గత దశాబ్ధ కాలంలో పంజాబ్ నమోదైన ఉగ్ర కేసుల్లో సగానికి పైగా కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాదుల సంబంధాలు బయటపడ్డాయి. 2016 తర్వాత పంజాబ్ లో సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లలను లక్ష్యంగా చేసుకని నిజ్జర్, మరికొందరు ఉగ్రవాదులు హత్యలు చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించాడు. భారత సీనియర్ దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణల్ని భారత్ తప్పుపట్టింది. ఇది రాజకీయ ప్రేరేపిత, అసంబద్ధ వ్యాఖ్యలని ఖండించింది. ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామని భారత విదేశాంగశాఖ ధ్వజమెత్తింది.