Uniform Civil Code: ప్రధాని నరేంద్రమోడీ యూనిఫా సివిల్ కోడ్(యూసీసీ)పై కీలక వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ముస్లిం సంస్థలు, పలు రాజకీయ పార్టీలు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిక్కులకు సంబంధించి అత్యున్నత సంస్థగా ఉన్న శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) యూనిఫాం సివిల్ కోడ్ ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. సంప్రదాయాలు, సంస్కృతి, మైనారిటీలకు పత్యేక గుర్తింపుగా ఉన్న అనేక వ్యవహారాలు క్షీణిస్తాయని ఆ సంస్థ చీఫ్ హర్జిందర్ సింగ్ ధామి గురువారం అన్నారు. యూసీసీని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: NASA: చంద్రుడిపై మైనింగ్ చేయాలని నాసా ప్లాన్..
దేశవ్యాప్తంగా యూసీసీని అమలు చేయడం వల్ల మైనారిటీ, గిరిజన వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) పేర్కొన్న ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూసీసీకి వ్యతిరేకంగా గట్టి వైఖరి తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది. సిక్కు గురుద్వారాలు (సవరణ) బిల్లు- 2023 విషయంలో, పంజాబ్‌లోని AAP ప్రభుత్వం మతపరమైన విషయాలలో జోక్యం చేసుకుంటోందని, ఇది సిక్కుల హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే అని ధామి విమర్శించారు. సిక్కు మతపరమైన వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ SGPC ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించిందని ఆయన వెల్లడించారు.
జూన్ 20న పంజాబ్ అసెంబ్లీ సిక్కు గురుద్వారా(సవరణ) బిల్లు 2023ను ఆమోదించింది. ఇది స్వర్ణదేవాలయం నుంచి గుర్బానీని ఉచితంగా ప్రసారం చేసే ఉద్దేశంతో ఈ బిల్లు ఉంది. 1925 నాటి సిక్కు గురుద్వారాల చట్టానికి ఎటువంటి సవరణలను అనుమతించబోమని చెప్పారు. పర్బంధక్ కమిటీ పాకిస్తాన్ లో సిక్కుల రక్షణను కూడా లేవనెత్తింది. పొరుగు దేశంలో సిక్కులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.