NTV Telugu Site icon

Navjot Singh Sidhu: నిమ్మరసం, వేపాకు, పసుపుతో.. స్టేజ్ 4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సిద్ధూ భార్య..

Navjot Singh Sidhu

Navjot Singh Sidhu

Navjot Singh Sidhu: మాజీ క్రికెటర్, పొలిటిషీయన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 క్యాన్సర్‌ని విజయవంతంగా ఓడించారు. ఆమె బతికే అవకాశం 3 శాతం మాత్రమే ఉందని వైద్యులు ప్రకటించినప్పటికీ, స్టేజ్-4 క్యాన్సర్‌ని అధిగమించారిన నవజ్యోత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నవజ్యోత్ కౌర్ ఒక సంవత్సరం నుంచి స్టేజ్ 4 క్యాన్సర్‌తో పోరాడుతోంది. స్టేజ్-3 ట్రీట్‌మెంట్ జరుగుతున్న సమయంలో వైద్యులు చిన్న ఆశ కల్పించాలరని వెల్లడించారు.

Read Also: BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’.. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు..

‘‘మా అబ్బాయి పెళ్లి తర్వాత ఆమెకు క్యాన్సర్ తిరిగి వచ్చింది. ఆమె బతుకుతుందా..?లేదా..? అనే అనుమానం మాలో ఉండేది. కానీ ఆమె ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. క్యాన్సర్‌ని ధైర్యంగా ఎదుర్కొంది’’ అని తన పోస్టులో వెల్లడించారు. పాటియాలలోని ప్రభుత్వ రాజేంద్ర మెడికల్ కాలేజీలో కౌర్ చికిత్స పొందిందని సిద్దూ ప్రస్తావించారు. ‘‘తమకు డబ్బు ఉందని ఆమె క్యాన్సర్‌ని ఓడించలేదు, ఆమె క్రమశిక్షణ, కఠినమైన దినచర్య, డైట్ అనుసరించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా క్యాన్సర్ సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు’’ అని సిద్దూ పేర్కొన్నారు.

ఆయుర్వేదం..ఆహారం కాపాడింది:

ఆమె నిమ్మరసం, పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేప ఆకులు, తులసి వంటివి ఆహారంగా తీసుకుందని సిద్దూ దంపతులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఈ ఆరోగ్యకరమైన పదార్థాలతో పాటు గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్‌రూట్, వాల్‌నట్‌తో తయారు చేసిన జ్యూసులు తీసుకుందని వెల్లడించారు. ఆమె తన ఆహారంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక ఆహారాలను తీసుకుందని చెప్పారు. కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు లేదా బాదం నూనెలతో చేసిన వంటలు మాత్రమే తీసుకున్నారని, దీంతో పాటు ఆమె ఉదయం టీలో దాల్చిన చెక్క, లవంగాలు , బెల్లం, యాలకులు తీసుకున్నట్లు తెలిపారు.