NTV Telugu Site icon

MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..

Siddhu Wife

Siddhu Wife

ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు (సోమవారం) ఓ లేఖను రిలీజ్ చేసింది. అందులో అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ఈ 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు వెల్లడించింది.

Read Also: Komatireddy Venkat Reddy: మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రత్యేక ఉద్యమం చేస్తాం..

అలాగే, మా అన్నయ్య పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఈ ప్లాట్లు ఇంత రాద్దాంతం చేస్తాయని తాను ఊహించలేదు కన్నడ సీఎం సతీమణి పార్వతి తెలిపింది. నా భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి ఏం కాదని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు ఆయన అధికారం నుంచి తాము ఏమీ ఆశించలేదు.. మాకు ఈ ఆస్తులు తృణప్రాయం. అందుకే ఈ స్థలాలను తిరిగి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు (ముడా) అప్పగిస్తున్నాను అని ప్రకటించింది. ఈ విషయంలో నా భర్త అభిప్రాయం ఏంటో నాకు తెలియదు.. నా కుటుంబ సభ్యులతోనూ చర్చించకుండా నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం ఇది అన్నారు.

Read Also: Adani Group: అదానీ, కెన్యా మధ్య ‘రహస్య’ ఒప్పందం.. బహిర్గతం చేసిన వ్యక్తికి ప్రాణహాని!

ఇక, ఈ ఆరోపణలు వచ్చిన రోజే ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నాను.. కానీ, నా భర్త రాజకీయ కుట్రలో మరింత నష్టపోతున్నాడని తెలిసి ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నాను అని సిద్ధరామయ్య భార్య పార్వాతి పేర్కొనింది. అవసరమైతే దర్యాప్తునకు కూడా సహకరిస్తాను.. రాజకీయ రంగానికి దూరంగా ఉండే నాలాంటి ఆడవాళ్లను వివాదాల్లోకి లాగొద్దని ఆమె ఆ లేఖలో ప్రస్తావించింది. మరోవైపు, ఈ పరిణామాలపై ముడా కమిషనర్‌ రియాక్ట్ అయ్యారు. ముడా ఆస్తులను ఎవరైనా వెనక్కి ఇచ్చేస్తే తాము తీసుకుంటాం.. దీనిపై అందరితో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.