Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- కర్ణాటకలో ఉత్కంఠకు తెర
- గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- జాతీయ మీడియాలో జోరుగా కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో గత కొద్దిరోజులుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య జరుగుతున్న కుర్చీ పంచాయితీ త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మంగళవారం హస్తిన వేదికగా జరిగిన పంచాయితీ ఒక కొలిక్కి వచ్చినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డీకే.శివకుమార్‌కు లైన్‌క్లియర్ అయినట్లుగా తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన గురువారం రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నాయకత్వ మార్పు చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ఢిల్లీలో జరిగిన వరుస సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సిద్ధరామయ్యకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. “ఇప్పుడు మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది” అని రాహుల్ గాంధీ చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి స్పందించిన సిద్ధరామయ్య.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అయితే అధికారికంగా రాజీనామా చేయడానికి ఒకటి లేదా రెండు రోజుల సమయం కావాలని కోరినట్లు సమాచారం.
ఇక ఈ మార్పు ప్రక్రియలో భాగంగా సిద్ధరామయ్యకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కీలక పదవి ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్ పేరు మళ్లీ బలంగా వినిపిస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించినప్పటి నుంచి సీఎం పదవిపై డీకే శివకుమార్ వర్గం ఆశలు పెట్టుకుంది. సీఎం పదవిని రొటేషన్ పద్ధతిలో పంచుకుంటారన్న ప్రచారం అప్పటి నుంచే సాగుతోంది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అలాంటి ఒప్పందం లేదని చెబుతూ వచ్చింది. కానీ ఇటీవల ఢిల్లీలో జరిగిన వరుస రహస్య సమావేశాలు మరోసారి రాజకీయ ఊహాగానాలకు ఊపిరి పోశాయి. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మాత్రం సీఎం మార్పు చర్చలను ఖండిస్తోంది. ఢిల్లీలో జరిగిన సమావేశం కేవలం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. “ఈరోజు చర్చ మొత్తం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే జరిగింది. మీరు ఊహిస్తున్నదేమీ నిజం కాదు” అని పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, రాహుల్ గాంధీ, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!