NTV Telugu Site icon

Siddaramaiah: సావర్కర్, గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు..

Siddaramaiah

Siddaramaiah

Siddaramaiah: హిందుత్వ సిద్ధాంతకర్తలు వినాయక్ దామోదర్ సావర్కర్, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎంఎస్ గోల్వాల్కర్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. గురువారం బెంగళూర్‌లోని కర్ణాటక కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ(కేపీసీసీ) కార్యాయలంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి గురించి ప్రజలు తెలుసుకోవాలని కోరారు.

ఆర్ఎస్ఎస్‌లో ‘గురూజీ’ అని పిలుచుకునే గోల్వాల్కర్ మూడు దశాబ్ధాలకు పైగా రాజ్యాంగానికి మద్దతు ఇవ్వకుండానే సంస్థను నడిపించారని సిద్ధరామయ్య తన ప్రసంగంలో అన్నారు. మహాత్మా గాంధీ హత్య కేసులో సావర్కర్ ఉన్నారని, అయితే, దానికి సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదలయ్యాని చెప్పారు. ప్రజస్వామ్యానికి వెన్నెముకగా నిలిచే భారత రాజ్యాంగాన్ని గోల్వాల్కర్, సావర్కర్ ఇద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన అన్నారు.

Read Also: Israel-Labnon: ఇజ్రాయెల్‌పై లెబనాన్ రాకెట్లు ప్రయోగం.. తిప్పికొట్టిన ఐడీఎఫ్ దళాలు

ముడా ల్యాండ్ స్కామ్ నుంచి కాంగ్రెస్ పార్టీ సావర్కర్ టార్గెట్‌గా దాడి చేస్తోంది. ఆ రాష్ట్ర మంత్రి దినేష్ గుండూ రావు మాట్లాడుతూ.. సావర్కర్ గోహత్యకు, గోమాంసానికి వ్యతిరేకం కానది, బీఫ్ తినేవాడని వ్యాఖ్యానించడం కొద్ది రోజుల క్రితం వివాదాస్పదమైంది. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణల్ని మరల్చడానికే కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది. 2022లో వీర్ సావర్కర్ బ్రిటీష్ వారిని క్షమాభిక్ష కోరి, జైలు నుంచి విముక్తుడయ్యాడని, భారత స్వాతంత్ర్యానికి సహకరించలేదని సిద్ధరామయ్య కామెంట్స్ చేశాడు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.