Site icon NTV Telugu

Shubhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా.. ఐఎస్ఎస్‌తో ఆక్సియం-4 డాకింగ్..

Iss

Iss

Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టి శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన ఘటన సాధించారు. ఆక్సియం-4 ఐఎస్ఎస్‌తో డాక్ అయింది. దాదాపు నెల రోజుల ఆలస్యం, అనేక వాయిదాల తర్వాత జూన్ 25న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ ఫ్లైట్ ఆక్సియం-4 విజయవంతంగా అంతరిక్షంలోకి బయలుదేరింది. ఇలా ఐఎస్ఎస్ చేరుకున్న మొదటి భారతీయుడి రికార్డు కూడా శుభాన్షు శుక్లా ఖాతాలో చేరింది.

Read Also: IFSC Code: ఐఎఫ్ఎస్ సి కోడ్ అంటే ఏమిటి? ఇది ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసా?

28 గంటలు ప్రయాణించిన డ్రాగన్ అంతరిక్ష నౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)ను చేరుకుంది. భూమికి 418 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ, గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఐఎస్ఎస్ ని చేరుకోవడానికి అంతరిక్ష నౌక అనేక విన్యాసాలు చేయాల్సి వచ్చింది. ఆక్సియం-4 బృందం ఐఎస్ఎస్‌లో దాదాపు 14 రోజులు ఉంటారు. అక్కడ ఉన్న సిబ్బందితో కలిసి పనిచేస్తారు. 60 కంటే ఎక్కువ సైన్స్ ఎక్సపరిమెంట్స్ నిర్వహిస్తారు. క్యాన్సర్ పరిశోధన, డీఎన్ఏ రిపేర్ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.

భారత్ నుంచి శుభాన్షుతో పాటు పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియెవ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు అమెరికాకు చెందిన కమాండర్ పెగ్గీ విట్సన్ ఈ వ్యోమనౌక ద్వారా ఐఎస్ఎస్ చేరుకున్నారు. మిషన్ పైలట్ అయిన శుక్లా, అంతరిక్షంలోక వెళ్లిన రెండో భారతీయుడిగా హిస్టరీ క్రియేట్ చేశారు. అంతకుముందు 1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాదాపుగా 4 దశాబ్ధాల తర్వాత మరో భారతీయులు స్పేస్‌లోకి ప్రవేశించారు.

Exit mobile version