Site icon NTV Telugu

Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఈ ఆధారాలే కీలకం.. వాటినే మిస్ అవుతున్న పోలీసులు

Shraddha Walkar Case

Shraddha Walkar Case

Shraddha Walkar case- delhi incident: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది శ్రద్ధావాకర్ హత్య కేసు. సహజీవనంలో ఉన్న ఆమెను అతని లవర్ అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృతదేహాన్ని 35 భాగాలు చేసి ఓ ఫ్రిడ్జ్ లో దాచి 18 రోజుల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పారేశాడు. ఆరు నెలల తర్వాత శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. సాక్ష్యాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో శ్రద్ధాను హత్య చేసి అఫ్తాబ్ కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలను కోర్టులో సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే శ్రద్ధాకు సంబంధించినవిగా చెబుతున్న ఎముకలను ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతం నుంచి పోలీసులు వెలికితీశారు. అయితే ఈ హత్యలో  హత్యకు ఉపయోగించిన ఆయుధం, శ్రద్ధా వాకర్ పుర్రె భాగం కీలకం కానున్నాయి.

Read Also: James Webb Space Telescope: అప్పుడే పుడుతున్న నక్షత్రాన్ని క్లిక్ మనిపించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

పోలీసులు వద్ద ఉన్న ఆధారాలు ఇవే..

నేరం చేసినట్లు అఫ్తాబ్ ఇచ్చిన వాంగ్మూలం, శ్రద్ధా శరీర భాగాలను ఉంచిన ఫ్రిడ్జ్. కత్తిని కొనుగోలు చేసి దుకాణదారు వాంగ్మూలం, అఫ్తాబ్ కు గాయం అయితే కట్టుకట్టిన డాక్టర్ అనిల్ సింగ్ వాంగ్మూలం, అడవిలో లభ్యం అయిన ఎముకను ఫోరెన్సిక్ కు పంపారు అధికారులు. వంటగదిలో రక్తపు నమూనాలను ఫోరెన్సిక్ కు పంపారు. అఫ్తాబ్ శ్రద్ధా అకౌంట్ నుంచి తీసిన రూ.54 వేల లావాదేవీ వివరాలు. ఫోన్ కాల్ లొకేషన్-ఫోన్ కాల్ రికార్డ్, అఫ్తాబ్ అపార్ట్మెంట్ లో లభ్యం అయిన శ్రద్ధా బ్యాగ్,

పోలీసులకు కావాల్సి ఆధారాలు ఇవే..

నిందితుడు ఉపయోగించిన ఆయుధం, శ్రద్ధా పూర్తి శరీరభాగాలు, హత్య జరిగిన రోజు అఫ్తాబ్, శ్రద్ధా ధరించిన దుస్తులు, శ్రద్ధా మొబైల్ ఫోన్, వీటితో పాటు నిందితుడు అఫ్తాబ్ ను నార్కో టెస్టు కోసం పోలీసులు అనుమతి కోరారు. అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధావే అని నిర్థారించేందు డీఎన్ఏ పరీక్షకు పంపారు. పరీక్ష ఫలితాలు రావడానికి 15 రోజుల సమయం పడుతుంది. దీంతో పాటు సెక్యూరిటీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటితో పాటు మూడేళ్ల క్రితం డేటింగ్ యాప్ బంబుల్ నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

Exit mobile version