కెనడాలో పంజాబీ గాయకుడు ప్రేమ్ ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్‌స్టార్ కాల్పులకు తెగబడ్డాడు. అర్ష్ దలాతో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టార్ కాల్పులకు బాధ్యత వహించాడు. అయితే ఈ కాల్పుల తర్వాత భద్రతపై భయాందోళనలు రేకెత్తిస్తోంది. కళాకారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇక రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. నేరస్థుడికి నేర సామ్రాజ్యంతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Jr NTR: కబీర్ vs వీరేంద్ర రఘునాథ్.. ఎన్టీఆర్ ప్లాన్ పెద్దదే!
గాయకుడు ప్రేమ్ ధిల్లాన్ ఇంటిపై కాల్పుల తర్వాత అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కళాకారులకు భద్రత కల్పించకపోతే ఎలా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులకు తెగబడినట్లుగా ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా సీరియస్‌గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశాన్ని వెలికి తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ola Roadster-X: ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త.. రేపే ఈవీ లాంచ్