Site icon NTV Telugu

Donald Trump: పర్‌ఫెక్ట్‌గా తల మధ్య గురి.. ఆ పని చేయకుంటే ట్రంప్ ప్రాణాలు పోయేవే.. వీడియో వైరల్..

Trump

Trump

Donald Trump: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని కలవరపెట్టింది. ఇటీవల పెన్సిల్వేనియాలోని బట్లర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌పైకి కాల్పులు జరిగాయి. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి 150 మీటర్ల దూరం నుంచి రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. అయితే, అదృష్టవశాత్తు బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ, స్వల్ప గాయం చేస్తూ వెళ్లింది. ఈ ఘటన తర్వాత వెంటనే అలర్ట్ అయిన సీక్రేట్ సర్వీస్ ఏజెంట్లు క్రూక్స్‌ని కాల్చి చంపి, ట్రంప్‌ని రక్షించారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, ఒకర మరణించారు.

Read Also: Mechanic Rocky: దీపావళి రేసులోకి మెకానిక్ రాకీ.. రిలీజ్ డేట్ ఫిక్స్..

కొన్ని క్షణాల తేడాతో, వెంట్రుకవాసిలో ట్రంప్ ప్రాణాలు దక్కించుకున్నారు. ట్రంప్ తన తలను వంచడంతోనే ప్రాణాలతో బయటపడ్డారు. ట్రంప్ స్ర్కీన్ గ్రాఫిక్‌ని చూసేందుకు మైక్రోఫోన్‌ వైపు వంగడంతో ప్రాణాలు దక్కినట్లు వైరల్ అవుతున్న వీడియో చూపిస్తోంది. కొత్తగా వచ్చిన ఓ వీడియోలో ట్రంప్ తల మధ్య భాగాన్ని నిందితుడు గురిపెట్టినట్లు చూపించింది. అదే క్షణంలో ట్రంప్ తన తలను వంచడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ దాడిపై రిపబ్లికన్ పార్టీ నేతలు, అధికార డెమోక్రాటిక్ పార్టీని, అధ్యక్షుడు జో బైడెన్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

Exit mobile version