NTV Telugu Site icon

Lack of PhD: ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీల కొరత

Phd

Phd

Lack of PhD: విద్యలేని వాడు వింత పశువు అంటారు. అంటే చదువు లేకపోతే జంతువుతో సమానమని దాని అర్థం. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. అయితే వారి చదివి ఎంత వరకు సాగుతుందనేది సెకండరీ. కొందరు ప్రైమరీ వరకు చదివితే .. కొందరు హైస్కూల్‌ వరకు చదువుతారు.. మరికొందరు ఉన్నత విద్యను కొనసాగిస్తారు. చదువులో ఉన్నతమైంది పీహెచ్‌డీ పట్టా. అంటే తను చదవాలనుకున్న దాంట్లో డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసపీ(పీహెచ్‌డీ) సాధించడం. అయితే పీహెచ్‌డీ పట్టా పొందడం అంతా సులువైన విషయం కాదు. ఎంతో కష్టపడాలి.. దాంతోపాటు తాను చేయాలనుకున్న అంశంపై అవగాహన ఉండాలి.. పట్టు సాధించాలి. అయితే దేశంలో పీహెచ్‌డీ చేసి విద్యా బోధనలో ఉండే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పీహెచ్‌డీ చేసి బోధనా వృత్తిలో ఉండే వారు .. అదీ ఉన్నత విద్యా సంస్థల్లో బోధన చేసే వారు చాలా తక్కువగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

Read also: Save Income Tax: ప్రతి నెలా పేరెంట్స్ కు రెంట్ ఇవ్వండి.. రూ. 99000 ఆదా చేస్కోండి

దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్‌డీల కొరత ఎక్కువగా ఉంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం .. ఈ సంస్థ ర్యాంకింగ్స్‌లో ఉన్న తొలి 100 కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల్లో సగటున 61.6 శాతం మందికి మాత్రమే పీహెచ్‌డీ డిగ్రీలు ఉన్నాయి. ఇతర విద్యా సంస్థల్లో 44. 63 శాతమే ఉంది. కానీ దేశంలోని మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థల్లో బోధించే వారిలో అత్యధికంగా 91.60 శాతం మందికి డాక్టరేట్‌ డిగ్రీ పట్టా ఉంది. ఇతర కళాశాలల్లో ఇది కేవలం 61 శాతం మాత్రమే ఉంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో మొదటి 100 స్థానాల్లో ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లోనే డాక్టరేట్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇతర సంస్థలు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌(పీజీ) డిగ్రీలున్న వారితోనే బోధనను నెట్టుకొస్తున్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ ఉన్న మొదటి 100 కళాశాలలు పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నాయని, అందుకే ఆ సంస్థల్లో దాదాపు అందరు అధ్యాపకులకూ పీహెచ్‌డీ డిగ్రీలు ఉన్నాయని యూజీసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.జగదీష్‌ కుమార్‌ చెప్పారు.

Read also: Naseem Shah: నా టార్గెట్ విరాట్ కోహ్లీ.. పాక్ యువ బౌలర్ హాట్ కామెంట్స్..

కొన్ని సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేసే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. వాటిల్లో ప్రధానంగా వాణిజ్య శాస్త్రం, న్యాయశాస్త్రం, వాస్తు శాస్త్రం, విదేశీ భాషల్లో పీహెచ్‌డీ చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఆయా కోర్సులు బోధిస్తున్న కళాశాలలు పీహెచ్‌డీ అధ్యాపకుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్ పొందిన టాప్‌ 100 కళాశాలల్లో ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో 81.20 శాతం మంది పీహెచ్‌డీ పట్టాలున్న వారు ఉన్నారు. మిగిలిన ఇంజినీరింగ్‌ కాలేజీల్లో వీరి సంఖ్య కేవలం 34.94 శాతం మాత్రమే ఉంది. ఇక ఉత్తమ యూనివర్సిటీల విషయానికి వస్తే టాప్‌ 100 విశ్వవిద్యాలయాలలో పీహెచ్‌డీ చేసిన అధ్యాపకులు 73.60 శాతం ఉన్నారు. ఫార్మసీ విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ చేసిన వారు చాలా తక్కువగా ఉన్నట్టు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ప్రకటించింది.