Shoot-at-sight order issued against a man-eater tiger in Bihar: మనిషి మాంసం తినడానికి అలవాటు పడిన పులిని చంపేయాలని బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో ప్రజలుపై మ్యాన్ ఈటర్ పులి దాడులు ఎక్కువ అయ్యాయి. మొత్తం 9 మందిపై దాడి చేసింది. పులిని చంపేయాలంటూ.. బీహార్ సర్కార్ షూట్ అట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసింది. గత సెప్టెంబర్ నెల నుంచి పశ్చిమ చంపారన్ జిల్లాలోని వాల్మీకి టైగర్ రిజర్వ్(వీటీఆర్) చుట్టుపక్కల ప్రాంతాల్లో నలుగురుని చంపింది. మొత్తంగా 12 ఏళ్ల బాలికతో సహా 9 మందిని చంపేసింది.
రంగియా అటవీ రేంజ్ లోని సింగహీ పంచాయతీ పరిధిలోని దుమారి గ్రామానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని శుక్రవారం ఉదయం పులి చంపేసింది. అంతకుముందు రోజు గురువారం మరో వ్యక్తిపై కూడా దాడి చేసి చంపింది. గత నెల కాలంలో నలుగురిని పులి హతమార్చి తిన్నది. దీంతో మనిషి మాంసానికి మరిగిన పులిని చంపేయాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. అంతకుముందు సింగహి ముస్టోలి గ్రామంలో బుధవారం రోజున 12 ఏళ్ల బాలిక పడుకున్న సమయంలో దాడి చేసి, మెడను నోట కరుచుకుని తీసుకెళ్లింది. ఆ తరువాత బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రిజర్వ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ నేషమని కే తెలిపారు. మే నుంచి ఇప్పటి వరకు మొత్తం 9 మందిని చంపినట్లు వెల్లడించారు. దీంతో డిపార్ట్‌మెంట్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్-కమ్-చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ శ్రీ ప్రభాత్ కుమార్ గుప్తా చంపేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Madhya Pradesh: రైలులో మహిళను వేధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కేసు నమోదు.
గత 25 రోజులలలో చివ్తహాన్, గోవర్థర్ అటవీ ప్రాంతానికి సమీపంలో పులి దాడులు చేసింది. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలో కి దిగింది. హైదరాబాద్ కు చెందిన షార్ఫ్ షూటర్ షఫత్ అలీ ఖాన్ తో పాటు మరికొంత మంది పులిని ట్రాక్ చేస్తున్నారు. గత ఆరు రోజులుగా పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మ్యాన్ ఈటర్ గా మారిన పులి వయస్సు 3.5 ఏళ్లు ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం దమ్రో గ్రామంలో సంజయ్ మహ్తో(35) వ్యక్తిపై దాడి చేసి స్థానికంగా ఉన్న చెరుకు తోటల్లోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు.
బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న వాల్మీకి నేషనల్ పార్క్ రాష్ట్రంలో ఏకైక జాతీయ టైగర్ రిజర్వ్. మొత్తం 898.45 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది విస్తరించి ఉంది. 2018 పులుల గణాంకాల ప్రకారం.. ఇక్కడ మొత్తం 40 పులులు ఉన్నట్లుగా తేలింది.