NTV Telugu Site icon

Jharkhand: బురదలో కూరుకుపోయిన కేంద్రమంత్రి కారు.. నడుచుకుంటూ వెళ్లిన శివరాజ్‌సింగ్

Jharkhand

Jharkhand

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ జార్ఖండ్ పర్యటనలో అపశృతులు చోటుచేసుకున్నాయి. బహరగోరాలో జరిగే బహిరంగ ర్యాలీకి వెళ్తుండగా ఒక్కసారిగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం బురదలో కూరుకుపోయింది. ఓ వైపున కుండపోత వర్షం.. మరో వైపు వాహనం ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. గొడుగుల సాయంతో కేంద్రమంత్రిని కిందకు దించేశారు. అనంతరం భారీ వర్షంలోనే కేంద్రమంత్రి యాత్రను కొనసాగించారు.

ఇది కూడా చదవండి: UP: యంత్రంతో 60 ఏళ్ల వృద్ధులను 25 ఏళ్లలోపు యువతగా మారుస్తామని చెప్పి.. ఆపై…

త్వరలోనే జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కోల్హాన్ డివిజన్‌ స్థాయిలో పరివర్తన్ యాత్ర ప్రారంభానికి వస్తున్నారు. అయితే బోరున వర్షం కురుస్తోంది. ఆయన వాహనం బురదలో కూరుపోయింది. అయినా కూడా వర్షంలోనే యాత్రను ప్రారంభించి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇవ్వడం.. వారితో సెల్ఫీలు దిగేందుకు అవకాశం కల్పించారు. స్వయంగా కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గొడుగు పట్టుకుని షెడ్డులో నిలబడిన కూలీలతో కరచాలనం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.