Site icon NTV Telugu

Sanjay Raut: శివసేన- ఎంఎన్‌ఎస్ మధ్య పొత్తు.. కాంగ్రెస్ పై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..!

Sanjay

Sanjay

Sanjay Raut: మహారాష్ట్రలో శివసేన (UBT), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) కూటమిలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉన్నప్పటికీ, అది ఏమాత్రం పట్టించుకోదగిన విషయం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు (నవంబర్ 22) ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తు కోసం ఢిల్లీలోని తమ అధిష్టానంతో చర్చించకుండా ఎలాంటి హామీ ఇవ్వడానికి ఆలోచిస్తుంది.. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వారి వ్యక్తిగత విషయమేనన్నారు. కానీ శివసేన- ఎంఎన్‌ఎస్ ఎవరి అనుమతి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, ప్రజల కోరిక మేరకే మా రెండు పార్టీలు ఒక్కటయ్యాయి.. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. తమతో కలిసి వచ్చేందుకు శరద్ పవార్- వామపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయని సంజయ్ రౌత్ వెల్లడించారు.

Read Also: Ibomma Ravi: మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం.. రవిని స్వయంగా విచారిస్తున్న సీపీ సజ్జనార్!

ఇక, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) సైతం బీజేపీని ఎదుర్కోవడానికి అందరూ ఏకమవ్వడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఎన్‌సీపీ, శివసేన (యూబీటీ)తో పొత్తును ఖరారు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.. ఇది పరోక్షంగా ఎంఎన్‌ఎస్‌ను కూడా కూటమిలో చేర్చుకోవడానికి ఒప్పుకున్నట్లేనని తెలిపారు. ఎంవీఏ (మహా వికాస్ అఘాడి) పార్టీలైన సమాజ్‌వాదీ, కమ్యూనిస్ట్ పార్టీలు, అంబేద్కర్ పార్టీల కార్యకర్తలంతా కలిసి పోరాడాలని అనుకుంటున్నారని ఎన్‌సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అహ్వాడ్ చెప్పుకొచ్చారు.

Read Also: IBomma Ravi Custody: విచారణలో బొమ్మ చూపిస్తున్న రవి.. రంగంలోకి ఎథికల్ హ్యాకర్స్?

అయితే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను హిందూ భావజాలం కలిగినపార్టీగా చూస్తూ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. కావునా, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఎంవీఏ పార్టీలతో పాటు తన సోదరుడు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌తో కలిసి పోటీ చేయాలని ఉద్ధవ్ ఠాక్రే పట్టుదలతో ఉన్నారు. కాబట్టి, కాంగ్రెస్‌ను ఈ కూటమిలో చేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బీఎంసీకి ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి. కాగా, కాంగ్రెస్ ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంతో.. మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఎన్నికల ఐక్యతపై సందేహాలు నెలకొన్నాయి. శివసేన (యూబీటీ) ఎంఎన్‌ఎస్‌తో సాన్నిహిత్యం కాంగ్రెస్‌కు నచ్చక పోవడంతోనే బీఎంసీ ఎన్నికలకు కూటమికి దూరంగా ఉంటుంది. ఠాక్రే బ్రదర్స్ పునఃకలయకను కాంగ్రెస్ స్వాగతించినప్పటికీ, ఎంఎన్‌ఎస్‌తో రాజకీయ పొత్తుకు మాత్రం దూరంగా ఉంది.

Exit mobile version