Site icon NTV Telugu

Maharashtra Political Crisis: శివసేనకు బిగ్‌ షాక్.. ఏ క్షణమైనా ఎంపీలు జంప్..!

Eknath Shinde

Eknath Shinde

మహారాష్ట్రలో పార్టీ రెండుగా చీలి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శివసేన పార్టీలో మరో భారీ కుదుపు తప్పేలా లేదు.. శివసేన ఎంపీలు రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే క్యాంపులోకి ఏ క్షణమైనా జంప్‌ అయ్యే అవకాశం ఉన్నట్టుగా జోరుగా ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే మహారాష్ట్ర రాజకీయం ఢిల్లీకి చేరింది.. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ హస్తినకు చేరుకున్నారు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు.. ఇక, ఢిల్లీలో ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌ షిండే ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.. దీని కోసం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు ఏక్‌నాథ్‌ షిండే.. ఇదే సమయంలో ఎంపీలు కూడా రెబల్‌ నేత క్యాంపులో అడుగుపెట్టనున్నారనే వార్త హల్‌చల్‌ చేస్తోంది.. ఏక్షణమైనా శివసేన ఎంపీలు కూడా షిండే క్యాంపులోకి జంప్ అయ్యే అవకాశం ఉంది… ఇప్పటి కే ఇద్దరు ఎంపీలు గౌహతిలో రెబల్‌ క్యాంపులో ఉండగా.. మిగతా వారు కూడా త్వరలోనే షిండే క్యాంపులో ప్రత్యక్షం కానున్నారట.. శివసేనకు లోక్‌సభలో 19 మంది ఎంపీలు ఉండగా.. రాజ్యసభలో 3 ఎంపీలు ఉన్నారు.. ఈ పరిణామం జరిగితే శివసేనకు అది కోలుకోలేని దెబ్బే.. మరోవైపు.. సాయంత్రం 5.30 గంటలకు మహారాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ముందుగా మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం నిర్వహించాలని భావించినా.. అది సాయంత్రానికి వాయిదా వేసినట్టు వెల్లడించారు.

Read Also: Jogi Ramesh: గుడివాడ గడ్డ కొడాలి అడ్డా.. ఈక కూడా పీకలేరు..!

Exit mobile version