Site icon NTV Telugu

Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఆగస్టు 22 వరకు జ్యుడీషియల్ కస్టడీ

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: పత్రాచల్ ల్యాండ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఆగస్టు 22 వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్రాచల్‌ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో ఆగస్టు 1వ తేదీన సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. తొలుత ప్రత్యేక కోర్టు ఈ నెల 4 వరకు ఈడీ కస్టడీకి అనుమతించగా.. ఆ తర్వాత దాన్ని 8వ తేదీ వరకు పొడిగించింది.

ఆ కస్టడీ నేటితో ముగియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఆయనను కోర్టులో హాజరుపర్చింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ రౌత్‌ కస్టడీని పొడిగించమని కోరలేదు. దీంతో న్యాయస్థానం ఆయనను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. కస్టడీ సమయంలో ఇంటి భోజనం, మందుల కోసం రౌత్‌ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. అయితే ప్రత్యేక పడక ఏర్పాట్లను కేటాయించే విషయంలో ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. జైలు నియమాల ప్రకారం.. అధికారులు తగిన పడక ఏర్పాట్లు చేస్తారని కోర్టు స్పష్టం చేసింది.

Mukesh Ambani: శాలరీ తీసుకోని ముఖేష్ అంబానీ. ఇది వరుసగా రెండో ఏడాది కావటం విశేషం.

జులై 31న శివసేన నాయకుడి ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేసి, కొన్ని గంటలపాటు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత ఆగస్టు 1న అరెస్టు చేశారు.రూ.1,034 కోట్ల పత్రాచల్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసును నిరోధించేందుకు సంబంధించి ఈ ఏడాది జూన్ 28న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంజయ్ రౌత్‌కు సమన్లు ​​జారీ చేసింది. కాగా.. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సంజయ్‌ రౌత్‌ భార్య వర్షా రౌత్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో గళ శనివారం ఆమె దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హాజరయ్యారు.

Exit mobile version