NTV Telugu Site icon

BMW hit-and-run case: శివసేన నుంచి ‘హిట్ అండ్ రన్’ నిందితుడి తండ్రి సస్పెండ్..

Mihir Shah, Rajesh Shah

Mihir Shah, Rajesh Shah

BMW hit-and-run case: ముంబైలో బీఎండబ్ల్యూ కార్ యాక్సిడెంట్ కేసు ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం ఏక్‌నాథ్ షిండేకి చెందిన శివసేన పార్టీ నాయకుడు కుమారుడే ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్నారు. ఆదివారం ముంబైలోని వర్లీ ప్రాంతంలో కారుని వేగంగా నడుపుతూ స్కూటర్‌పై వస్తున్న భార్యభర్తల్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో 45 ఏళ్ల మహిళ మరణించింది. నిందితుడైన మిహిర్ షా, పాల్ఘర్ జిల్లా శివసేన ప్రధాన నాయకుడైన రాజేష్ షా కుమారుడు. ఘటన జరిగిన సమయంలో కారులోనే మిహిర్ షాతో పాటు అతని డ్రైవర్ ఉన్నట్లుగా తేలింది.

Read Also: Kenza Layli : తొలి మిస్‌ ఏఐ కిరీటాన్ని కైవసం చేసుకున్న మొరాకో ఇన్‌ఫ్లుయెన్సర్‌..

ఈ నేపథ్యంలోనే శివసేన నుంచి రాజేష్‌ షాని సస్పెండ్ చేశారు. అతని సస్పెన్షన్‌ని సీఎం షిండే ఆమోదించారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడు మిహిర్ షా పరారయ్యాడు. 72 గంటల తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రాజేష్ షాని ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు, బెయిల్‌పై విడుదల చేశారు. మిహిర్ షా తప్పించుకోవడానికి రాజేష్ షా మరియు బిదావత్ సహాయం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మిహిర్ షా మరియు అతని నలుగురు స్నేహితులు జుహులోని వైస్-గ్లోబల్ తపస్ బార్‌లో ఉన్న కొన్ని గంటల తర్వాత ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ముంబైలో కనీన మద్యపాన వయసు 25 ఏళ్లు, కాగా నిందితుడి మిహిర్ షాకు 24 ఏళ్లు. మద్యం అందించిన బార్ షాపుని ముంబై పురపాలక అధికారులు కూల్చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను కావేరీ నఖ్వాగా గుర్తించారు. ఆమె భర్త ప్రదీప్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ దారుణమైన ఘటనక పాల్పడిన మిహిర్ షాను ఉరితీయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.