NTV Telugu Site icon

Adjournment Motion: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. ఉభ‌య‌ స‌భ‌ల్లో వాయిదా తీర్మానాలు..!

Parlament

Parlament

Adjournment Motion: పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. అయితే, బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ప‌రిణామాల‌పై చ‌ర్చించాల‌ని కోరుతూ ఇవాళ ఉభ‌య‌ స‌భ‌ల్లోనూ వాయిదా తీర్మానాలు చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా వాయిదా తీర్మానం ఇవ్వగా.. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితిపై ప్రధానంగా చర్చించాలని.. ఆ దేశం వ‌ల్ల భార‌త్‌పై ప‌డే ప్రభావం గురించి చ‌ర్చించాల‌ని ఆయ‌న త‌న వాయిదా తీర్మానంలో వెల్లడించారు. ఇక, లోక్‌స‌భ‌లోనూ ఇదే అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ మ‌నీశ్ తివారి ఈ తీర్మానం ప్రవేశ పెట్టారు.

Read Also: Gold Rate Today: ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! కిలో వెండిపై రూ.3200 తగ్గింది

కాగా, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ సమావేశం స్టార్ట్ అయింది. ఈ మీటింగ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజుతో పాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష భేటీకి హాజరయ్యారు. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హ‌సీనా భారత్ లోనే ఉన్నారు. అయితే, లండ‌న్‌లో ఆమెకు ఆశ్రయం దొరికే ఆమె ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం.