Site icon NTV Telugu

Shashi Tharoor: అలా విమర్శించి మూర్ఖుడిలా మిగిలా

Shashitharoor

Shashitharoor

శశిథరూర్.. కాంగ్రెస్ ఎంపీ. కానీ పొగడ్తలు మాత్రం కేంద్రంపై ఉంటాయి. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఒక్క కామెంట్ ఉంటుంది. తరచుగా ప్రధాని మోడీని, కేంద్ర పెద్దలను ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. దీంతో ఆయన కాంగ్రెస్ వీడనున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఇటీవల తన అవసరం లేకుంటే చెప్పాలని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఆ మధ్య ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు ట్రంప్‌తో భేటీపై కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా కేంద్రానికి అనుకూలంగా శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Mega Star : వ్యోమగాముల రాకనుద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేసే సమయంలో భారత్ వైఖరిని తప్పుపట్టానని.. రష్యా తీరును ఎందుకు ఖండించలేదని ఆరోజు నిలదీశానని.. కానీ తనకు అసలు విషయం ఇప్పుడు బోధపడిందన్నారు. ప్రస్తుతం మన దేశం… దేశాల మధ్య శాశ్వత శాంతి తీసుకొచ్చే దేశంగా ఉందని అర్థమైందన్నారు. యుద్ధం సమయంలో ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులను కౌగిలించుకునే ప్రధాని మన దేశంలో ఉన్నారని ఇప్పుడు అర్థమైందన్నారు. అప్పుడు అలా మాట్లాడి.. ఇప్పుడు తానొక మూర్ఖుడిలా మిగిలిపోయానని శశిథరూర్ చెప్పుకొచ్చారు. మూడేళ్ల తర్వాత శాంతి నెలకొనే పరిస్థితులు వచ్చాయంటే భారత వైఖరి ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుందన్నారు.  యూరప్‌ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం వల్ల భారత్ అనేక ప్రయోజనాలు పొందుతోందని శశి థరూర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Hema : శివగామి లాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయను..

Exit mobile version