Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ జోక్.. వైరల్‌ అవుతోన్న కామెంట్‌

  • ప్రియాంక చోప్రాపై శశిథరూర్ జోక్
  • వైరల్‌గా మారిన పంచ్
Shashi Tharoor

Shashi Tharoor

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై పంచ్ వేశారు. ప్రస్తుతం ఈ జోక్ వైరల్ అవుతోంది. ప్రతిస్పందనగా రకరకాలైన కామెడీ రిప్లైలు, మీమ్స్ వస్తున్నాయి. అసలేం జరిగింది. కాంగ్రెస్ నేత.. హీరోయిన్ గురించి ఏం జోక్ చేశారో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: UP: తాళి కట్టే సమయంలో వధువు షాక్.. నిర్ఘాంతపోయిన పండితులు.. బంధువులు

అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్-2026లో ప్రసంగించేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, హీరోయిన్ ప్రియాంక చోప్రాను వక్తలుగా ఆహ్వానించారు. ఇద్దరూ ఒకే వేదికపై ఆసీనులై ప్రసంగిస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా ప్రియాంక చోప్రా కార్యక్రమానికి హాజరై ప్రసంగించి వెళ్లిపోయారు. అనంతరం శశిథరూర్ ఒంటరైపోయారు.

ఈ సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ శశిథరూర్ ఎక్స్‌లో ఆసక్తికర కామెంట్ చేశారు. ‘‘కానీ.. కలిసి కాదు.. అయ్యో!’’ అంటూ పంచ్ వేశారు. ఒకే వేదికను పంచుకోలేకపోయామంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఇక శశిథరూర్ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో రకరకాలైన కామెంట్లు, మీమ్స్ వస్తున్నాయి. ఒకరు ‘‘హహహహ.. హృదయంలో ఇంకా చిన్నవాడు. వయసు కేవలం ఒక సంఖ్య.’’ అని రాసుకొస్తే.. ఇంకొకరు ‘‘ప్రియాంక భర్త నిక్ జోనాస్‌ అదృష్టవంతుడు.’’ అని రాసుకొచ్చారు. ఇలా రకరకాలైన కామెడీ పంచ్‌లు వేశారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఇక ఈ కార్యక్రమానికి శశిథరూర్ కుమారుడు ఇషాన్ ధరూర్, కోడలు భూమి థరూర్ పాల్గొన్నారు. శశిథరూర్… యాస్పోరా సమస్యలు, ప్రపంచ భౌగోళిక రాజకీయాలపై ప్రసంగించారు. యువకుల్లో ఉత్సాహం స్ఫూర్తిదాయకంగా ఉందని, విద్యార్థి నిర్వాహకుల ప్రయత్నాలకు అభినందనలు అని తెలిపారు.