NTV Telugu Site icon

Maldives Row: భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవులకు తెలుస్తోంది..

Maldives

Maldives

Maldives: గతేడాది మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జూ భారత్ వ్యతిరేక, చైనా అనుకూల వైఖరి ప్రదర్శి్స్తున్నాడు. మాల్దీవుల్లో మానవతాసాయాన్ని నిర్వహిస్తున్న భారత సైనిక సిబ్బందిని వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. అటుపై చైనాతో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ భారత్‌కి యాంటీగా వ్యవహరిస్తు్న్నాడు. మరోవైపు లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి.

పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన మాల్దీవులకు ఇండియాలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిస్తోంది. మాల్దీవుల అధికారుల పర్యాటక గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో మొత్తం 34,847 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంలో 56,000 మందికి పైగా పర్యాటకులు మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. దాదాపుగా 38 శాతం వరకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య పడిపోయింది.

Read Also: Amit Shah: గాంధీనగర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా..

జనవరి 2024లో 12,792 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో, మొత్తం 11,522 మంది ఆ దేశానికి వెళ్లారు. గతేడాది ఇదే నెలలో 19,497 మంది పర్యాటకులు సందర్శించారు. ఈ ఏడాది మార్చిలో 8,322 మంది మాల్దీవులకు వెళ్తే, గతేడాది మార్చిలో 18,099 మంది వెళ్లారు. ప్రధాని మోడీపై మాల్దీవులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇండియన్స్ నుంచి స్ట్రాంగ్ రెస్పాన్స్ వచ్చింది. ‘‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’’ అంటూ ఇంటర్నెట్లో ట్రెండ్ చేశారు.

2018లో మాల్దీవులకు లక్ష మంది భారతీయులు వెళ్తే, 2019 ఇది 1.6 లక్షలకు చేరింది. కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ దేశాన్ని భారతీయ పర్యాటకులే ఆదుకున్నారని చెప్పాలి. కోవిడ్ -19 ఆంక్షలు సడలించిన తర్వాత ఏకంగా 2.91 లక్షల మంది భారతీయ పర్యాటకు ఆ దేశాన్ని సందర్శించారు. ఇదిలా ఉంటే ఈ పరిణామాలతో భారతీయ పర్యాటకులు తగ్గడంతో, చైనాకు వెళ్లిన ముయిజ్జూ ఆ దేశ పర్యాటకులను తమ దేశానికి పంపాల్సిందిగా అభ్యర్థించాడు.