Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కొద్దిరోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార మార్పిడితో రాజకీయాలు వేడెక్కిన వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తన రాజకీయ పార్టీకి చెందిన అన్ని జాతీయ స్థాయి విభాగాలు, సెల్స్‌ను తక్షణమే రద్దు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ బుధవారం తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ప్రపుల్ పటేల్ పోస్ట్ చేశారు. యితే.. నేషనలిస్ట్ మహిళా కాంగ్రెస్, నేషనలిస్ట్ యువ కాంగ్రెస్, నేషనలిస్ట్ విద్యార్థి కాంగ్రెస్‌లను మినహాయించినట్లు చెప్పారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిన తరువాత ఎన్సీపీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనక గల కారణాలను కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ వెల్లడించలేదు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయిన కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. శివసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఎన్‌సీపీ కీలక భూమిక పోషించింది. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో వారి ప్రభుత‍్వం కూలిపోయింది. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆ రాష్ట్రంలో ఇంకా రాజకీయ వేడి తగ్గలేదు.
తనకు18 మంది శివసేన ఎంపీల మద్దతు ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారం అన్నారు. రాష్ట్రంలోని ఓబీసీలకు సంబంధించి చర్చలు జరిపేందుకు ఢిల్లీ చేరుకున్న షిండే, జులై 20న సుప్రీంకోర్టు తన ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఇటీవలి రాజకీయ సంక్షోభం, శివసేన పార్టీ నియంత్రణకు సంబంధించి శివసేనలోని రెండు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు బుధవారం విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే క్యాంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమకు పంపిన అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ ఏక్‌నాథ్ షిండే క్యాంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారించనుంది.
Lightning strikes: పిడుగుల బీభత్సం.. యూపీలో 14 మంది, బిహార్‌లో 5గురు బలి
మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో లుకలుకలు మొదలయ్యాయి. యోగి ఆదిత్యనాథ్ కు సొంత మంత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సీఎం యోగిపై ఇద్దరు మంత్రులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో ఒకరు ఏకంగా రాజీనామానే సమర్పించగా.. మరొకరు బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. తాను దళితుడిని కావడం వల్లే తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ జలశక్తి శాఖ మంత్రి దినేశ్ ఖటీక్ బుధవారం రాజీనామా చేశారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజీనామా లేఖను పంపి, అవినీతి ఆరోపణలు చేశారు.