NTV Telugu Site icon

Maharashtra: ‘‘దిశ సాలియన్‌పై ఆదిత్య ఠాక్రే అత్యాచారం చేశాడని చెప్పాలి’’.. మహా రాజకీయాల్లో ప్రకంపనలు..

Disha

Disha

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ టార్గెట్‌గా ఆయన పలు ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, ఫడ్నవీస్ తనను తప్పుడు అఫిడవిట్ సమర్పించాలని ఒత్తిడి తీసుకువచ్చారని అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. అప్పటి మంత్రులు ఆదిత్య ఠాక్రే, అజిత్ పవార్‌లతో పాటు అనిల్ పరాబ్‌లపై రాతపూర్వక ఆరోపణలు చేయాలని తనను కోరినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు చేస్తే తనపైకి ఈడీ, సీబీఐ రాదని ఫడ్నవీస్ చెప్పిటన్లు దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. అయితే, తాను జీవితాంతం జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా ఆరోపణలు చేయనని చెప్పానని, తాను తలవంచలేదని చెప్పారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో, ఆత్మహత్య చేసుకుని మరణించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో, ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య కేసులో అప్పటి మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, వీటిపై కూడా అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. దిశా సాలియన్‌పై ఆదిత్యఠాక్రే అత్యాచారం చేసి, ఆమెను బాల్కనీ నుంచి తోసేశాడని ఆరోపించాలని, తప్పుడు అఫిడవిట్ ఇవ్వాలని ఒక మధ్యవర్తి తనను కోరాడని ఆయన పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Read Also: Fertility: IVF సెంటర్లకు పరుగుపెడుతున్న భారతీయులు.. పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. కారణాలేంటి..?

వసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వంలో అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రిగా పనిచేశారు. ముంబైలోని హోటల్, బార్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేయమని పోలీసు అధికారుల్ని ఆదేశించారని అప్పటి ముంబై కమిషనర్ ఆరోపించడంతో అనిల్ దేశ్‌ముఖ్ 2021లో తన హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 2021లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా, ఏప్రిల్ 2022లో అవినీతి కేసులో సీబీఐ చేత అరెస్ట్ చేయబడ్డాడు.

అయితే, ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అవన్నీ నిరాధారమైనవని ఖండించారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లపై దేశ్‌ముఖ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అనేక వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ వీడియోలను బహిరంగపరచడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. దేశ్‌ముఖ్‌కి చెందిన ఆధారాలనపు ఫడ్నవీస్ బయటపెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆందోళనకు దిగారు. దేశ్‌ముఖ్ చెప్పేదే నిజం కావచ్చు, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని పటోలే చెప్పారు.