Shakur Khan: పాక్ గూఢచారి షకుర్ ఖాన్ అరెస్ట్.. రాజస్థాన్ మాజీ మంత్రితో సంబంధాలు!
- పాక్ గూఢచారి షకుర్ ఖాన్ అరెస్ట్
- రాజస్థాన్ మాజీ మంత్రితో సంబంధాలు!
- మొబైల్‌లో కీలక ఫైల్స్ డిలీట్ అయినట్లు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి షకుర్ ఖాన్‌ను బుధవారం రాత్రి జైసల్మేర్‌లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది. షకుర్ ఖాన్‌పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉన్నత స్థాయి సమాచారం మేరకు షకుర్ ఖాన్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సుధీర్ చౌదరి తెలిపారు. ఇక షకుర్ ఖాన్ ఫోన్‌లో పలువురి పాకిస్థానీయుల నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి గురించి సరైన సమాధానం ఇవ్వలేనట్లుగా తెలుస్తోంది. ఇక పాకిస్థాన్‌కు ఏడు సార్లు వెళ్లినట్లుగా గుర్తించారు. అయితే మొబైల్స్‌లో కొన్ని ఫైల్స్ డిలీట్ అయినట్లుగా కనిపెట్టారు. అలాగే బ్యాంక్ ఖాతాలపై కూడా దృష్టి పెట్టారు. ఇటీవలే ఒక ఖాతా క్లోజ్ అయింది. దానిపై కూడా ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: MLC Kavitha : మిస్టర్ కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు… విరుచుకుపడ్డ కవిత..
Also Read
- LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
- Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
- Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
ఇదిలా ఉంటే షకుర్ ఖాన్‌కు రాజస్థా్న్ మాజీ మంత్రి షేల్ మొహమ్మద్‌తో మంచి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా వ్యక్తిగత సహాయకుడిగా పని చేసినట్లు అధికారులు గుర్తించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో షేల్ మొహమ్మద్ మంత్రిగా పని చేశారు. షకుర్ ఖాన్-షేల్ మొహమ్మద్ గ్రామాలు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. మొహమ్మద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పని చేశారు. అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు.
ఇది కూడా చదవండి: Allu Arjun : గౌరవంగా భావిస్తున్నా.. గద్దర్ అవార్డుపై అల్లు అర్జున్..
షకుర్ ఖాన్ తరచుగా మొహమ్మద్ తండ్రి ఘాజీ ఫకీర్‌ను కలిసేవాడని స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో షకుర్ ఖాన్, మొహమ్మద్, ఘాజీ ఫకీర్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. ఇక 2021లో ఘాజీ ఫకీర్ మరణించారు.
మే 7న ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దులో జైసల్మేర్‌పై అధికారులు నిఘా పెట్టినట్లుగా పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ చౌదరి తెలిపారు. సరిహద్దులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అదుపులోకి తీసుకున్న ఏడో వ్యక్తి షకుర్ ఖాన్ అని వెల్లడించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసేసింది. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.
తాజావార్తలు
-
Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
-
Spirit Release Date Announced: ప్రభాస్’ రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
-
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
-
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
-
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!