Site icon NTV Telugu

Shubhanshu Shukla: శుభాన్షు శుక్లా ఆస్ట్రోనాట్ నెంబర్ 634.. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా రికార్డ్

Shubhanshu Shukla

Shubhanshu Shukla

Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి చేరుకున్న తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. గురువారం ఆక్సియం-4 వ్యోమనౌక ఐఎస్ఎస్‌తో డాకింగ్ అయింది. ఐఎస్ఎస్ చేరిన తర్వాత తన అనుభవాన్ని శుభాన్షు వివరించారు. ‘‘ఇది తేలికగా అనిపించిందని, కానీ తన తల కొంచెం బరువుగా ఉంది’’ అని అన్నారు. ఆయన అధికారికంగా వ్యోమగామి నంబర్ 632, అంతరిక్ష కేంద్రం పిన్ పొందారు. రాబోయే రెండు వారాలు గొప్పగా ఉంటుందని చెప్పారు.

Read Also: Hydra: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు.. నంబర్ షేర్ చేసిన హైడ్రా..

ఆక్సియం -4 సిబ్బందితో కలిసి తన స్వాగత ప్రసంగంలో, భూమిని అంతరిక్షం నుంచి చూసే అవకాశం పొందిన కొద్దిమందిలో ఒకరిగా ఉండటం ఒక గౌరవం అని శుక్లా అన్నారు. బుధవారం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ప్రయోగించిన ఆక్స్-4 సిబ్బంది, 28 గంటల ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్ చేరారు. తన ప్రయాణాన్ని అద్భుతంగా అభివర్ణించిన ఆయన..‘‘నేను దీని కోసం ఎదురుచూస్తున్నాను, సిబ్బంది నన్ను చాలా స్వాగతించారు. మా కోసం వారి తలుపులు తెరిచారు. రాబోయే 14 రోజులు ఉత్తేజకరమైనవి, గొప్పగా ఉండబోతున్నాయి’’ అని అన్నారు.

Exit mobile version