Rajasthan High Court: ఇద్దరు పెద్దలు వివాహం తర్వాత పరస్పర సమ్మతితో లైంగిక కార్యకలపాల్లో పాల్గొనడం నేరం కాదని రాజస్థాన్ హైకోర్ట్ పేర్కొంది. తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని హైకోర్టు విచారించి, ఈ రోజు తీర్పు చెప్పింది. అయితే, సదరు మహిళ కోర్టు ముందు హాజరై.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, నిందితుల్లో ఒకరితో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది.
జస్టిస్ బీరేంద్ర కుమార్ తీర్పు సందర్భంగా మాట్లాడుతూ.. ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం వ్యభిచారం నేరం కిందకు ఇది రాదని చెప్పారు. ఇద్దరు పెద్దలు వివాహం అనంతరం సంబంధం కలిగి ఉంటే అది చట్టబద్ధమైన నేరంగా పరిగణించబడదని కోర్టు పేర్కొంది. ఇద్దరూ కూడా వారి సొంత ఇష్టానుసారం శారీరక సంబంధాలను కలిగి ఉంటే, అది నేరం కాదని హైకోర్టు చెప్పింది. ఈ కేసులో ఎలాంటి మెరిట్ లేదని, వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టేసింది.
Read Also: DMK: మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే చికెన్, మటన్ తినడంపై బ్యాన్.. సాంబర్ రైస్ దిక్కవుతుంది..
అసలు ఈ కేస్ ఏంటి..?
తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఓ వ్యక్తి ఆరోపిస్తూ, వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయితే, ఈ విషయం కోర్టుకు చేరడంతో సదరు మహిళ కోర్టు ముందు హాజరై తన ఇష్టానుసారమే నిందితుడితో లివ్-ఇన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళపై చర్యలు తీసుకోవాలని భర్త తరుపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.