NTV Telugu Site icon

Karnataka Elections: కర్ణాటకలో అధికారం ఎవరిది..? ఒపీనియన్ పోల్స్ చెబుతున్నది ఇదే..

Karnataka Elections

Karnataka Elections

Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరో 5 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే మెజారిటీ ఒపీనియన్ పోల్స్ బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని తమ సర్వేలను వెల్లడించాయి. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, లేకపోతే సింగిల్ లార్జెట్ పార్టీగా అవతరిస్తుందని చెబుతున్నాయి. మూడు ఒపీనియన్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే.. మూడు రోజుల క్రితం వెలుబడిన జీన్యూస్-మాట్రిక్స్ ఒపీనియన్ పోల్ మాత్రం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది.

ఒపీనియన్ పోల్స్ చెబుతున్నది ఇదే..

ఏబీపీ-సీ ఓటర్:

ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రకారం కర్ణాటకలోని 224 సీట్లలో కాంగ్రెస్ 107-119 స్థానాలు, బీజేపీ 74-86, జేడీఎస్ 23-35 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఓట్లపరంగా బీజేపీకి 35 శాతం, కాంగ్రెస్ కు 40 శాతం, జేడీఎస్ కు 17 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇండియా టుడే-సీ ఓటర్ కూడా ఇలాంటి ఫలితాలనే వెల్లడించింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యకు 42 శాతం మద్దతు తెలుపగా.. బీజేపీ బసవరాజ్ బొమ్మైకి 31 శాతం మాత్రమే జైకొట్టారు.

ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్:

(మొత్తం సీట్లు – 224)
బీజేపీ: 74 నుంచి 86 సీట్లు

కాంగ్రెస్: 107 నుండి 119 సీట్లు

JD(S): 23 నుండి 35 సీట్లు

ఇతరులు: 0 నుండి 5 సీట్లు

ఓటు భాగస్వామ్యం

బీజేపీ – 35%

కాంగ్రెస్ – 40%

JD(S) – 17%

ఇతరులు – 8%

జీ న్యూస్-మ్యాట్రిజ్:

ఇదిలా ఉంటే సోమవారం విడుదలైన జీ న్యూస్-మ్యాట్రిజ్ కర్ణాటక ఎన్నికల ఒపీనియన్ పోల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఆ తర్వాత కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు ఉంటాయని పేర్కొంది.

జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే:

మొత్తం స్థానాలు(224)

బీజేపీ: 103-115

కాంగ్రెస్: 79-91

JD (S): 26-36

ఇతరులు: 1-3

ఓటు భాగస్వామ్యం
బీజేపీ: 42%

కాంగ్రెస్: 40%

JD(S): 15%

ఇతరులు: 3%

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ గేమ్ చేంజర్ గా మారవచ్చని, అయితే రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చిందని తెలిపింది. జీ న్యూస్ మార్చి 29-30 మధ్య నిర్వహించిన తన అభిప్రాయ సేకరణలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి 1.80 లక్షల మంది పురుషులు మరియు 1.12 లక్షల మంది మహిళలు పాల్గొన్నందున ఇప్పటివరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన అన్ని ఒపీనియన్ పోల్స్‌లో ఇదే అతిపెద్ద నమూనా అని పేర్కొంది. కన్నడ వార్తా ఛానెల్ సువర్ణ న్యూస్ 24×7 మరియు జన్ కీ బాత్ కూడా తమ రెండవ మరియు చివరి ప్రీ-పోల్ సర్వేను నిర్వహించాయి మరియు మే 10 పోల్‌లో బిజెపి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించనుందని అంచనా వేసింది.