NTV Telugu Site icon

Supreme court: మోడీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

Kejriwal

Kejriwal

ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మోడీ డిగ్రీపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ యూనివర్సిటీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారించిన న్యాయస్థానం పిటిషన్ కొట్టేసింది. దీంతో ఆయనపై పరువు నష్టం కేసు విచారణ కొనసాగనుంది.

ఇది కూడా చదవండి: Pemmasani Chandra Shekar: అక్రమాలకు తావు లేకుండా ‘ఆవాస్’ లబ్ధిదారుల ఎంపిక

గుజరాత్ యూనివర్సిటీ వేసిన పరువు నష్టం కేసులో భాగంగా గుజరాత్ పోలీసులు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఇక్కడ కూడా కేజ్రీవాల్‌కు భంగపాటు ఎదురైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. వాదోపవాదాల అనంతరం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో ఇలాగే ఆప్ నేత సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 2024లో కొట్టివేసినట్లు ధర్మాసనం గుర్తుచేసింది.

ఇది కూడా చదవండి: Pemmasani Chandra Shekar: అక్రమాలకు తావు లేకుండా ‘ఆవాస్’ లబ్ధిదారుల ఎంపిక

ఇదిలా ఉంటే సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మోడీ డిగ్రీని యూనివర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు? ఆ డిగ్రీ నకిలీదా? అని ఆయన ప్రశ్నించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉంటే గుజరాత్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కాదు నరేంద్ర మోడీయే పరువు నష్టం దావా వేయాల్సిందని సింఘ్వీ వాదించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను యూనివర్సిటీకి అవమానకరంగా పరిగణించలేమన్నారు. యూనివర్సిటీ తరఫున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సంజయ్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. యూనివర్సిటీ లాయర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పరువు నష్టం విచారణను కొనసాగించాలని నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: Jupally Krishna Rao : సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయం.. కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల పార్టీ