బీహార్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. అధికార జేడీయూలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పార్టీ సీనియర్ నాయకుడు కేసీ త్యాగిని అధిష్టానం బహిష్కరించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. కొన్ని విభేదాలు కారణంగా జేడీయూ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. అయినా కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉంటున్నారు. అనూహ్యంగా శనివారం ఆయన్ను పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది.
ఇది కూడా చదవండి: Trump: జేడీ వాన్స్, మార్కో రూబియో పిల్లలకు ట్రంప్ బహుమతులు.. ఏమిచ్చారంటే..!
గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కూటమి భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దాదాపు 202 స్థానాలు గెలిచి తిరిగి విజయాన్ని అందుకుంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే జేడీయూలో కీలక నేతగా ఉన్న కేసీ త్యాగి మాత్రం ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది.
ఇది కూడా చదవండి: Trump-Iran: 217 మంది నిరసనకారుల మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
