NTV Telugu Site icon

Sam Pitroda: అశ్లీల వీడియోలపై పిట్రోడా సంచలన ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్ర విద్యాశాఖ

Sampitroda

Sampitroda

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా సంచలన ఆరోపణలు చేశారు. ఐఐటీ రాంచీ విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తున్న సమయంలో హ్యాక్ చేసి పోర్న్ వీడియో ప్రదర్శించారని తీవ్ర ఆరోపణల చేశారు. వంద మంది విద్యార్థులతో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగిందని.. అకస్మాత్తుగా ఎవరో హ్యాక్ చేసి అశ్లీల కంటెంట్‌ను చూపించారన్నారు. వెంటనే ఆపేయడం తప్ప మాకు వేరే మార్గం కనిపించలేదన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది న్యాయమా?, దేశంలో ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని పిట్రోడా ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Coolie : కూలీలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే

పిట్రోడా ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. అసలు ఐఐటీ రాంచీ అనేదే ఉనికిలో లేదని.. అలాంటిది హ్యాక్ చేయడం ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేసింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం మానుకోవాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయినా పిట్రోడాకు భౌతికంగా లేదా వర్చువల్‌గా ఉపన్యాసం చేయడానికి ఇన్‌స్టిట్యూట్ ఏ కాన్ఫరెన్స్/సెమినార్‌కు ఆహ్వానించలేదని ఐఐఐటీ రాంచీ ధృవీకరించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఐటీల ఖ్యాతి అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తల కృషి, సాధనపై నిర్మించబడిందని పేర్కొంది. ప్రముఖ సంస్థలను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!