Site icon NTV Telugu

New Delhi: వీర్యం తారుమారులో రూ. 1.50 కోట్ల జరిమానా

New Delhi

New Delhi

New Delhi: ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు అన్నీ.. ఇన్నీ కావు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే వారిని కదలిస్తే చాలు.. వారి బాధలను చెప్పుకుంటూ పోతూనే ఉంటారు.. అన్ని ఉంటాయి వారి బాధలు. ప్రైవేటు ఆసుపత్రులు చేసే చికిత్స కంటే.. వేసే బిల్లే ఎక్కువగా ఉంటుంది. ఆ బిల్లును చూసిన రోగులకు, రోగి కుటుంబీకులకు కొత్త రోగాలు వస్తున్నాయి. అలాంటిదే న్యూఢిల్లీలో ఒక ఘటన జరిగింది. వీర్యంను తారు మారు చేశారు. దీంతో బాధితులు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో కేసు విచారించిన కమిషన్‌ వీర్యం తారు మారు చేసిన ప్రైవేటు హాస్సిటల్‌కు ఏకంగా రూ. 1.50 కోట్ల జరిమానా విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి..

Read also: Puvvada Ajay Kumar: పక్క రాష్ట్రాల్లో ఆర్టీసి పరిస్థితి బాగోలేదు..!

దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించారు. అసిస్టెట్‌ రిప్రొడక్టివ్‌ టెక్నిక్‌(ఏఆర్‌టీ) విధానంలో సంతానం కోసం దపంతులు ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తరువాత 2009 జూన్‌లో వారికి కవల పిల్లలు జన్మించారు. శిశువులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించగా.. వారి తండ్రి అతడు కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు జన్మించినట్టు స్పష్టమయింది. మనోవేదనకు గురైన దంపతులు తమకు న్యాయం చేయాలని, రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని కోరుతూ వారు ఎన్‌పీడీఆర్‌సీని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ, దర్యాప్తు అనంతరం వారికి అనుకూలంగా కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దంపతులకు రూ. 1.50 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవటు ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రిలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎన్‌పీడీఆర్‌ కమిషన్‌ అభిప్రాయ పడింది.

Exit mobile version