Site icon NTV Telugu

Foreign currency: చెన్నై, కొచ్చి విమానాశ్రయాల్లో విదేశీ కరెన్సీ, బంగారం పట్టుకున్న అధికారులు

Foreign Currency

Foreign Currency

Foreign currency: కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ చెన్నై విమానాశ్రయంలో 56 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది సీజ్ చేసింది. సింగపూర్ వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఇద్దరి ప్రయాణీకుల లగేజ్ బ్యాగ్ లను సిఐఎస్ఎఫ్ స్కానింగ్ చేయగా షాక్‌ కు గురయ్యారు. విదేశీ కరెన్సీని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులో తీసుకున్నారు. కస్టమ్స్ AIU బ్యాచ్‌కు చెందిన అధికారులు చేసిన ప్రొఫైలింగ్ ఆధారంగా, SQ529 ఫ్లైట్ ద్వారా సింగపూర్‌కు వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. వారి బ్యాగేజీని పరిశీలించగా, వారి బ్యాగేజీలో 56 లక్షల విలువైన విదేశీ కరెన్సీని దాచిపెట్టారు. కాగా.. కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం దానిని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

Read also: JP Nadda: ఏపీ-తెలంగాణలో నూతన బీజేపీ ఆఫీస్‌.. వర్చువల్ ద్వారా ప్రారంభించనున్న జేపీ నడ్డా

ఇక రెండవ సంఘటనలో, 6E 1404 విమానంలో అబుదాబి నుండి కొచ్చి విమానాశ్రయానికి వస్తున్న ప్రయాణికుడిని గ్రీన్ ఛానల్ వద్ద అడ్డుకున్నారు. ప్రయాణికున్ని పరీక్షించగా ఆశ్చర్యానికి గురయ్యారు. అతని శరీరం లోపల దాచిపెట్టిన మొత్తం 1063 గ్రాముల 4 గుళికల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు త్రిసూర్ జిల్లాలోని కున్నంకుళానికి చెందిన మహమ్మద్‌గా గుర్తించినట్లు కస్టమ్ డిపార్ట్‌మెంట్ వర్గాలు తెలిపాయి. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి వెనుక ఎవరున్నారు ఎవరి ప్రోత్సాహంతో బంగారాన్ని తరలించేందుకు ప్లాన్‌ వేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు.
MLA vs MLC: పండుగపూట డీజేసౌండ్స్ తో మారుమోగిన తిరుమలగిరి.. పోటా పోటీగా బీజేపీ, కాంగ్రెస్

Exit mobile version