NTV Telugu Site icon

Seema Haider: భారత్-పాకిస్తాన్ “సరిహద్దు”పై ప్రశ్న..స్టూడెంట్ ఏం రాశాడో తెలుసా..? చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Seema Haider

Seema Haider

Seema Haider: భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించి పరీక్షలో ప్రశ్న అడగడం, దీనికి ఓ విద్యార్థి రాసిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజెన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్ ధో‌ల్‌పూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో పొలిటికల్ సైన్స్ పరీక్షల్లో ఓ ప్రశ్నకు విద్యార్థి రాసిన సమాధానం చూస్తే నవ్వాపుకోలేరు. అంతలా ఇంటర్నెట్‌ని ఆకట్టుకుంటుంది ఈ సమాధానం.

విషయానికి వస్తే.. పరీక్షలో ‘‘ భారత్- పాకిస్తాన్ కే బీచ్ కౌన్సీ సీమా హై, లంబే బతావో..?(భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఏ సరిహద్దు ఉంది, దాని పొడవు చెప్పండి?)’’ అనే ప్రశ్న వచ్చింది. దీనికి సదరు విద్యార్థి ఏకంగా ‘సీమ’(సరిహద్దు)ని ‘‘సీమా హైదర్’’గా పొరబడ్డాడు. ఇటీవల సీమా హైదర్ అనే యువతి తన ప్రేమికుడిని వెతుక్కుంటూ పాకిస్తాన్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌కి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Read Also: BJP: “అయోధ్య రాముడి” నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్లాన్..

స్టూడెంట్ భారత్-పాకిస్తాన్ మధ్య సీమ(సరిహద్దు) సీమా హైదర్ అని, ఆమె ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలను రెండు దేశాల మధ్య దూరంగా రాశాడు. దీంతో ఒక్కసారిగా ఈ సమాధానం వైరల్ అవుతోంది. ఈ సమాధానం చూసి పడిపడి నవ్వుకుంటున్నారు. ”దోనో దేశోం కే బీచ్ సీమా హైదర్ హై. ఉస్కీ లంబై 5 అడుగుల 6 అంగుళాల హై. దోనో దేశోం కే బీచ్ ఇస్కో లేకర్ లడాయి హై (సీమా హైదర్ రెండు దేశాల మధ్య ఉంది. ఆమె 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు. ఆమె కారణంగా దేశాలు పోరాడుతున్నాయి)’’ అని సమాధానం రాశాడు.

దీనిపై నెటిజన్లు ఫన్నీగా రిఫ్లై ఇస్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థి ఒకరు కామెంట్ చేయగా.. ఇంకొకరు ‘ అతను రాసిన వినూత్న సమాధానికి అదనపు మార్కులు ఇవ్వాలి’ అని, మరొకరు ‘ విద్యార్థి ఇరు దేశాల మధ్య అంతరాన్ని తగ్గించాడు, అతన్ని సస్పెండ్ చేయరని ఆశిస్తున్నా’ అంటూ రిఫ్లై ఇచ్చారు.

ఈ ఏడాది పాకిస్తాన్‌కి చెందిన సీమా హైదర్ అనే యువతి భారత్ లోని సచిన్ మీనా కోసం తన పిల్లలతో సహా భారత్ వచ్చింది. పబ్జీ గేమ్‌తో ఇద్దరు కలిశారు. 2019లో వీరి పరిచయం జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది తన నలుగురి పిల్లలతో నేపాల్ ద్వారా ఇండియాలోకి వచ్చింది. ప్రస్తుతం సీమా హైదర్, సచిన్ మీనా సహజీవనం చేస్తున్నారు.