సీమా హైదర్.. 2013లో ఈమె దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి కారణం నలుగురు పిల్లలతో కలిసి పాకిస్థాన్ నుంచి ఆన్‌లైన్ ప్రేమికుడైన సచిన్ మీనా కోసం భారత్‌కు రావడంతో సంచలనం సృష్టించింది. దీంతో అప్పట్లో ఈ వార్త హల్‌చల్ చేసింది. అయితే ఆమె గురించి ఇప్పుడెందుకంటారా? తాజాగా ఆమెకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
18-03-2025(మంగళవారం) సీమా హైదర్-సచిన్ మీనా దంపతులకు ఆడపిల్ల పుట్టింది. దీంతో సీమా హైదర్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మంగళవారం ఐదో బిడ్డకు సీమా హైదర్ జన్మినిచ్చింది. ఐదో బిడ్డకు జన్మినిచ్చినట్లు ఆమె న్యాయవాది సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
ఆన్‌లైన్‌లో సీమా హైదర్-సచిన్ మీనా మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. అనంతరం సీమా హైదర్.. తన నలుగురి పిల్లలతో కలిసి నేపాల్ మీదగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పట్టుబడింది. వీళ్లిద్దరూ అప్పటికే నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక బెయిల్ వచ్చాక.. ఇద్దరికి సానుకూలంగా పరిస్థితులు మారాయి. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నివాసం ఉంటున్నారు. ఇక సీమా హైదర్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దీంతో ఆమె లక్షల్లో సంపాదిస్తోంది. సాప్ట్‌వేర్లు కంటే ఆమెనే ఎక్కువగా సంపాదిస్తున్నట్లుగా సమాచారం.
ప్రస్తుతం సీమా హైదర్.. ఐదో బిడ్డకు జన్మనివ్వడంతో సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్‌గా మారింది. సీమా-సచిన్ న్యాయ సలహాదారు ఏపీ.సింగ్ మాట్లాడుతూ.. మార్చి 18న దంపతులకు ఆడపిల్ల పుట్టిందని పేర్కొన్నాడు. ఆస్పత్రిలో డెలివరీ అయినట్లుగా తెలిపాడు. 2024లోనే ఈ జంట కీలక ప్రకటన చేసింది. సీమా హైదర్.. ఏడు నెలల గర్భవతిగా సచిన్ ప్రకటించాడు. ఇక పాకిస్థాన్‌లో మొదటి భర్తతో సీమా హైదర్ నలుగురు పిల్లల్ని కనింది. తాజాగా సచిన్ మీనాతో కలిసి మరొక బిడ్డను కనడంతో ఐదుగురు సంతానం అయ్యారు.