Site icon NTV Telugu

Security Cabinet Meeting: కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం..

Cabinet

Cabinet

Security Cabinet Meeting: జమ్ము కాశ్మీర్ లో టూరిస్టులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సుమారు 28 మంది మరణించారు. వీరిలో దాదాపు 20 మందికి పైగా గాయపడగా.. ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. దీంతో యావత్‌ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, పహల్‌గామ్‌ లో ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ పర్యటనను రద్దు చేసుకున్నారు. మధ్యలోనే సౌదీ పర్యటన నుంచి తిరిగొచ్చిన ప్రధాని ఎయిర్ పోర్టులోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో అత్యవసర సమీక్ష నిర్వహించారు.

Read Also: Aghori Srinivas: అరుపులు, కేకలతో రచ్చ రచ్చ.. జైలులో హంగామా చేసిన అఘోరీ శ్రీనివాస్!

అయితే, పాకిస్థాన్ కి సరైన బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే, కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకి సీసీఎస్ కీలక సమావేశం కానుంది. కాగా, ఇప్పటికే కాశ్మీర్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. దీంతో కాశ్మీర్ లోని పలు ప్రాంతాలు, ఎల్ఓసీ వద్ద భద్రతా దళాలను త్రివిధ దళాధిపతులు అప్రమత్తం చేశారు.

Exit mobile version