NTV Telugu Site icon

PM Security Breach: భద్రతా ఉల్లంఘన.. ప్రధాని మోదీ దగ్గరగా వెళ్లిన వ్యక్తి..

Pm Security Breach

Pm Security Breach

PM Security Breach: ప్రధాని నరేంద్రమోదీ భద్రతలో మరోసారి వైఫల్యం ఎదురైంది. భద్రతా వలయాన్ని ఉల్లంఘించి ఓ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరదాకా వెళ్లాడు. కర్నాటకలో హుబ్బలిలో మోదీ రోడ్ షో చేస్తున్న సమయంలో ఈ ఘటన గురువారం ఎదురైంది. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని అడ్డగించి లాగిపడేశారు.

Read Also: Etela Rajender: ప్రజలను మోసం చేయడంలో.. కేసీఆర్ నంబర్ వన్

పూలమాల వేయడానికి ప్రయత్నించేందుకు వ్యక్తి ప్రయత్నించాడు. ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి జాతీయ యూత్ ఫెస్టివల్ జరిగే ప్రాంతానికి ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో మోదీ కారు నుంచి బయటకు వచ్చి జనాలకు అభివాదం చేస్తున్నారు.

గతంలో పంజాబ్ పర్యటనలో ఉండగా కూడా ఇలాగే జరిగింది. పంజాబ్ పోలీసుల వైఫల్యం కారణంగా ప్రధాని భద్రతా ఉల్లంఘన జరిగింది. ఫిరోజ్ పూర్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఏకంగా కొన్ని నిమిషాల వరకు మోదీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయింది. రైతులు రోడ్డుపై నిరసన తెలుపుతున్న సమయంలో ఇది జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టింది. ఈ భద్రతా ఉల్లంఘనకు మేమే కారణం అంటూ అప్పట్లో ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రకటించుకున్నారు.