NTV Telugu Site icon

Bomb threats: మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. రెండు రోజుల్లో 12 విమానాలకు హెచ్చరికలు..

Bomb Threats

Bomb Threats

Bomb threats: దేశంలో వరసగా విమానాలు బాంబు బెదిరింపులు ఎదుర్కొంటున్నాయి. బుధవారం కూడా మరో రెండు విమానాలకు ఇలాంటి వార్నింగ్స్ వచ్చాయి. ఢిల్లీ నుంచి బెంగళూర్‌కి బయలుదేరే ఆకాసా ఎయిర్ విమానానికి, ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానానికి బెదిరింపులు వచ్చాయి. రెండు రోజుల్లో ఇలా 12 విమానాలకు నకిలీ బెదిరింపులు రావడం సంచలనంగా మారాయి. ఆకాస QP 1335 విమానంలో 177 మంది ఉన్నారని, అందులో ముగ్గురు శిశువులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని అకాసా ఎయిర్ ప్రతినిధి తెలిపారు. ఢిల్లీకి తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఇండిగోకి చెందిన 6E 651 ముంబై-ఢిల్లీ విమానం అహ్మదాబాద్‌కు దారి మళ్లించబడింది. ప్రయాణికులందర్ని సురక్షితంగా దించామని ఇండిగో ప్రతినిధి చెప్పారు.

Read Also: MUDA Scam: సీఎం సిద్ధరామయ్యకి షాక్.. ముడా చైర్మన్ రాజీనామా..

అంతకుముందు మంగళవారం ఎయిర్ ఇండియా ఢిల్లీ-చికాగో విమానం కాకుండా, డమ్మమ్-లక్నో ఇండిగో విమానం, అయోధ్య-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దర్భంగా నుండి ముంబైకి స్పైస్‌జెట్ విమానం (SG116), బాగ్‌డోగ్రా నుండి బెంగళూరుకు అకాస ఎయిర్ విమానం (QP 1373) అలయన్స్ ఎయిర్ అమృత్‌సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానానికి (9ఐ 650), మదురై నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి (ఐఎక్స్ 684)కి బాంబు బెదిరింపులు వచ్చాయి.

సోమవారం రెండు ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా విమానాకి ఇలాగే బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరసగా బెదిరింపులు వస్తుండటం, విమాన ఆపరేషన్స్‌కి ఇబ్బందులు తలెత్తడంతో ఈ అంశంపై ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. దీనికి ముందు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీసీజీఏ అధికారులతో ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. దీంట్లో కొందరు నిందితులను అధికారులు గుర్తించనట్లు తెలుస్తోంది.

Show comments