Site icon NTV Telugu

Junk Food: ‘జంక్ ఫుడ్’ తిన్నందుకు తండ్రి మందలింపు.. విద్యార్థిని ఆత్మహత్య..

Nagpur

Nagpur

Junk Food: జంక్ ఫుడ్ తినడం ఓ యువతి ఆత్మహత్యకు కారణమైంది. జంక్ ఫుడ్ తిన్నందుకు తండ్రి మందలించడంతో 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ) చేస్తున్న భూమిక వినోద్ ధన్వానీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఈ రోజు వెల్లడించారు. నగరంలోని సింధీ కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.

Read Also: India Growth: భారత వృద్ధి 8 శాతం పైమాటే.. ఆర్బీఐ కథనం..

భూమిక థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. జంక్ ఫుడ్ తిన్నందుకు తండ్రి ఆమెను మందలించడంతో కలతచెందిందని, దీంతో ఆమె వంటగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రతాప్ నగర్ పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఉదయం చూసే సరికి భూమిక ఉరేసుకుని ఉన్నట్లు గమనించారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. యాక్సిడెంటల్ డెత్‌గా పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version