భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని సంబరపడేలోగా శాస్త్రవేత్తలు మరో నిజం బయటపెట్టారు. భారత్‌లో డెల్టాప్లస్ వేరియంట్‌ను గుర్తించినట్టు తెలిపారు. అయితే, దీని వ్యాప్తి ఇండియాలో పెద్దగా లేదని, ఆంధోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ఐఆర్-ఐజీఐబి శాస్త్రవేత్త వినోద్ స్కారియా ట్వీట్ చేశారు. ఈ వేరియంట్ వలన వ్యాధి తీవ్రత ఎంత అధికంగా ఉంటుంది అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని అన్నారు. కే417ఎన్ మ్యూటేషన్ కారణంగా బి1.617.2 వేరియంట్‌కు కారణం అవుతుందని, ఈ వేరియంట్ శరీరంలోని కణాలలోకి చొచ్చుకుపోయి వ్యాధి తీవ్రతను పెంచేందుకు కే417 ఎన్ మ్యూటేషన్ దోహదం చేస్తుందని, కానీ ఇండియాలో కే417 ఎన్ మ్యూటేషన్ వేరియంట్ పెద్దగా కనిపించడం లేదని, యూరప్, అమెరికా దేశాల్లో ఈ వేరియంట్ కనిపిస్తుందని తెలిపారు.