Gurugram: గురుగ్రామ్‌లో దారుణం.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు గ్యాంగ్‌రేప్
- గురుగ్రామ్‌లో దారుణం
- ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు గ్యాంగ్‌రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు మాత్రం అగడం లేదు. ఎక్కడొక చోట అబలలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ముంబైలో ఒక డెలివరీ బాయ్.. మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనను మరువక ముందే గురుగ్రామ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. స్నేహితుడి పిలుపు మేరకు పార్టీకి వెళ్లిన పాఠశాల ఉపాధ్యాయురాలిపై అత్యంత దారుణంగా జిమ్ శిక్షకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Mumbai: బ్లింకిట్ బాయ్ దుశ్చర్య.. డెలివరీ చేస్తూ మహిళను ఏం చేశాడంటే..!
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
గురుగ్రామ్‌కు చెందిన ఒక మహిళ భర్తతో కలిసి నివసిస్తుంది. ఒక ప్రముఖ పాఠశాలలో విదేశీ భాషలు బోధిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 37 ఏళ్ల గౌరవ్ అనే వ్యక్తి సెప్టెంబర్‌లో జరిగిన ఓ పార్టీలో స్నేహితుడు అయ్యాడు. అనంతరం ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకుని సంభాషించుకుంటున్నారు. అంతేకాకుండా పలుమార్లు వ్యక్తిగతంగా కూడా కలుసుకున్నారు. మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 1న గౌరవ్ ఫోన్ చేసి పర్సనల్‌గా కలుసుకుని మాట్లాడుకుందామని ఆహ్వానించాడు. దీంతో గురుగ్రామ్‌లోని గౌరవ్ స్నేహితుడైన నీరజ్ (32) ఇంటికి రావాలని చిరుమానా పంపించాడు. దీంతో అర్థరాత్రి సమయంలో ఆమె నీరజ్ ఇంటికి చేరుకుంది. ఆమె ఇంటికి రాగానే గౌరవ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా స్నేహితులైన నీరజ్, యోగేష్ (29), అభిషేక్ (28) లకు ఫోన్ చేసి రప్పించాడు. అనంతరం ఆ ముగ్గురు కూడా వరుసగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోయింది.
ఇది కూడా చదవండి: Gyanesh Kumar: బీహార్‌లో ఈసారి కొత్త విధానం.. బూత్‌లో ఎన్ని ఓట్లు ఉంటాయో చెప్పిన సీఈసీ
మరుసటి రోజు ఉదయం బాధిత మహిళ ఉమెన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని.. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!